
“భరత్ అనే నేను” పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్ తో పాటు, తనయుడు గౌతమ్ కృష్ణ కూడా ఓ కీ రోల్ చేయబోతున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత ఉందో గానీ, రెట్టించిన ఉత్సాహంతో ప్రిన్స్ అభిమానులు దీనిని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. “1 నేనొక్కడినే” సినిమా ద్వారా పరిచయమైన గౌతమ్ కు మంచి మార్కులే పడ్డాయి గానీ, మళ్ళీ గౌతమ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూపించేటంత రిస్క్ ను మహేష్ తీసుకుంటాడా? అన్నది కీలకంగా మారింది.
అయితే లభించిన ట్రేడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం ప్రకారం… “భరత్ అనే నేను” సినిమాలో మహేష్ చిన్నప్పటి క్యారెక్టర్ ఉన్న మాట వాస్తవమే గానీ, అది గౌతమ్ చేస్తున్నాడన్న దాంట్లో మాత్రం నిజం లేదని, ఇది కేవలం ఒట్టి పుకారే అంటూ కొట్టిపడేసారు. క్రేజీ కాంభినేషన్స్ తో తెరకెక్కుతోన్న సినిమాల గురించి పలు రకాల పుకార్లు షికారు చేయడం ఇండస్ట్రీలో చాలా సహజమైన విషయం. అందులోనూ ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంభినేషన్ కు ఈ మాత్రం క్రేజ్ అంచనా వేసిందే!
Humour, unusual characters, unexpected situations and conversations form the focus of the latest trailer of…
The Andhra Pradesh municipal election results have delivered several unexpected outcomes. Candidates who were confident…