
సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సరిలేరు నీకెవ్వరూ కు వచ్చిన అత్యధిక టీవీఆర్ రేటింగ్‌ను ఈ చిత్రం దాటగలదా అని చూడాలి. సరిలేరు నీకెవ్వరూ టెలివిజన్ ప్రీమియర్ కు 23.04 టీవీఆర్ రేటింగ్వచ్చింది. కెజిఎఫ్ రేటింగ్‌ను దాటగలదా అని చూడాలి. అయితే టెలివిజన్‌లో మహేష్ బాబు చిత్రాన్ని ఓడించడం అంత సులభం కాదు.
మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ… టీవీలలో సినిమాలు ఎక్కువగా చూసేది వారే. అయితే కెజిఎఫ్ ఫక్తు మాస్ సినిమా. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా రెండవ భాగం, కెజిఎఫ్ 2 ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రం దసరా కోసం విడుదల కావాల్సి ఉంది కాని కరోనా బ్రేక్ కారణంగా ఇది వాయిదా పడింది.
ఈ సినిమా వచ్చే ఏడాది వరకు వాయిదా పడింది. షూటింగ్ పునః ప్రారంభించిన తర్వాతే విడుదల తేదీ స్పష్టత బయటపడుతుంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాత అనేక భాషలలో సినిమాలు విడుదల అవుతాయి. అటువంటి తరుణంలో కెజిఎఫ్ 2 అనేక భాషలలో ఒకేసారి విడుదల అయ్యేందుకు అనుకూలమైన రిలీజ్ డేట్ దొరకడం అంత తేలికైన వ్యవహారం కాదు.
పాలకులు అవినీతికి పాల్పడుతుంటే ఆ దేశం, రాష్ట్రాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. అదే.. రాజకీయ పార్టీలు నైతిక విలువలు వదిలేస్తే,…
Social media is breeding ground for trolls and wild stuff and it has been the…