
ఇది పబ్లిసిటీ అనుకుంటే అది మీ అభిమతానికే వదిలేస్తా. జరుగుతున్న నష్టం నాకు, ఆ నొప్పి, బాధ నావి. నాకు ఉచిత సలహాలు ఇచ్చే బదులు పవన్ ఫ్యాన్స్ ను ఆగమనో, పవన్ కళ్యాణ్ ను ఆగమనో ఎందుకు చెప్పరు? అంటూ తనకు సలహాలు ఇచ్చేవారిని కూడా ప్రశ్నించారు. ఒకవేళ వాళ్ళు మీ మీద కూడా దాడి చేస్తారని భయమా? అయితే నా పోరాటం మాత్రం ఆపను, మీకు చిరాకు అనిపిస్తే దయచేసి నన్ను బ్లాక్ చేసేయ్యండి… అంటూ ఫేస్ బుక్ వేదికగా తన భావాలను వ్యక్తపరిచారు.
పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళినపుడు తానూ ఓ వీడియోను చూశానని, తనకు మద్దతు తెలిపిన జమీల పట్టాన్ గారు ఒకరని, సదరు వీడియోను పోస్ట్ చేసారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి పిలుపునిస్తున్న వాళ్ళల్లో ఈమె ఒకరని, ఇందుకు ధన్యవాదాలు తెలిపారు మహేష్ కత్తి. వ్యక్తిగతంగా మహేష్ కత్తిపై కక్ష్య కట్టే బదులు, అభిమానులంతా తమ చుట్టూ ఉన్న సమస్యలను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి, ఇలాగే అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపై రియాక్ట్ అవ్వండి… అంటూ పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు ఈమె.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి మరోకీలక శుభవార్తనే చెప్పాలి. రాష్ట్రానికి ఆటోమొబైల్ పరిశ్రమల పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కియా సంస్థను…
Watching Suriya and Dhanush together on the big screen would itself be an interesting prospect.…