
అయితే ఎట్టకేలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సమస్య తీరిందని, ప్రొడక్షన్ యూనిట్ “సంభవామి” అనే టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్టర్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. దీంతో టైటిల్ సమస్య తీరిందని, కొత్త ఏడాది కానుకగా టైటిల్ లోగోతో పాటు చిత్ర ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేస్తారన్న అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లోనూ “సంభవామి”గానే ప్రిన్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. పవర్ ఫుల్ గా ఉన్న ఈ టైటిల్ పై ప్రిన్స్ అభిమానులు మాత్రం ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వడం లేదు.
మాస్ అప్పీల్ ఉన్న టైటిల్ వస్తుందని సర్వత్రా అంచనాలు వేయడం… చివరికి ఒక పరమార్ధం వచ్చేలా టైటిల్ ఉండడంతో… ప్రిన్స్ అభిమానుల నుండి స్పందన కరువయ్యింది. గతంలో ‘ఏజెంట్ శివ’ తదితర టైటిల్స్ హల్చల్ చేసినపుడు నిర్ధాక్షిణ్యంగా బాగోలేదని, పాత సినిమాల మాదిరి ఉందని కుండబద్దలు కొడుతూ చెప్పారు. కానీ, ఈ సారి మాత్రం అటు పాజిటివ్ గా, ఇటు నెగటివ్ గా స్పందించడం లేదు. అయితే ఈ టైటిల్ తో మాస్ కు చేరువ కావడం కష్టమే కానీ… మహేష్ రేంజ్ లో టైటిల్ పెద్దగా కీలక పాత్ర పోషించకపోవచ్చు.
Ram Charan and Sujeeth working together is once again being discussed in industry circles. Nothing…
Nani has never been shy about backing his films. But while watching his promotions for…