కేటీఆర్ కే కాదు, హరీష్ రావుకు కూడా పట్టాభిషేకం!

mamaku prematho harish rao victory in narayankhedఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ తనయుడు కేటీఆర్ పై సోషల్ మీడియా కురిపించిన ప్రశంసలు తెలిసిన విషయమే. “నాన్నకు ప్రేమతో…” అంటూ కేసీఆర్ – కేటీఆర్ లున్న ఫోటోలు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సృష్టించిన సందడి సోషల్ మీడియా విజ్ఞులకు తెలిసిందే. అయితే కేటీఆర్ కే కాదు, హరీష్ రావుకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులున్నారని ప్రస్తుతం హల్చల్ చేస్తున్న టైటిల్స్, ఫోటోలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

కేసీఆర్ కు మేనల్లుడైన హరీష్ రావు నారాయణఖేడ్ ఎన్నికలలో సత్తా చాటారని, దీంతో అల్లుడు సత్తా చాటి… “అల్లుడా… మజాకా…” అనిపించుకున్నారని, అలాగే ఇదే సమయంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విజయాన్ని కేసీఆర్ కు బహుమతిగా ఇస్తూ తన మామ మీదున్న ప్రేమను చాటి… “మామకు ప్రేమతో…” అన్న టైటిల్ కు సార్థకతను చేసారని… ఇలా ఎవరి క్రియేటివిటీకు అనుగుణంగా వారు పోస్టర్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల విజయం అందించిన ఉత్సాహం అలాంటిది మరి!

ADVERTISEMENT
Latest Stories