Telugu

సిఎం మమతా బెనర్జీకి ఫామ్‌హౌసు ఉండే ఉంటుంది!

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్ళారు. ప్రోటోకాల్ ప్రకారం సిఎం మమతా బెనర్జీ స్వయంగా ఆమెకు విమానాశ్రయంలో ఆహ్వానం పలకాలి. కానీ ఆమె మొహం చాటేశారు. కనీసం మంత్రులను కూడా పంపించలేదు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు అంతర్జాతీయ ఆదివాసీ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. కానీ ఆ సదస్సుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కానీ రాష్ట్రపతి ముర్ము సదస్సులో పాల్గొన్నారు. అప్పుడు కూడా ఆదివాసీలు తన వద్దకు రాకుండా బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులు వస్తే ఏ ప్రభుత్వమైనా రాజకీయాలకు అతీతంగా తప్పనిసరిగా ప్రోటోకాల్ మర్యాదలన్నీ పాటించాలి. కానీ సిఎం మమతా బెనర్జీ ఆమెను బిజేపి ప్రతినిధిగానే చూశారు తప్ప కనీసం సాటి మహిళగా కూడా గౌరవించకపోవడం శోచనీయమే.

త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో తొలిసారిగా అధికార పగ్గాలు చిక్కించుకోవాలని బిజేపి అధిష్టానం చాలా పట్టుదలగా ఉంది. కనుక సిఎం మమతా బెనర్జీ ప్రోటోకాల్ వంటి సున్నితమైన విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి కదా?

ఇదివరకు కేసీఆర్‌ తెలంగాణ సిఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోడీ, గవర్నర్‌ తమిళసై సౌందర్ రాజన్‌తో ఇదేవిధంగా చాలా అనుచితంగా వ్యవహరించారు. అందుకు శాస్తి అనుభవిస్తున్నారిప్పుడు.

ఇప్పుడు సిఎం మమతా బెనర్జీ కూడా అచ్చం కేసీఆర్‌లాగే అహంకారంతో వ్యవహరిస్తూ రాష్ట్రపతి ముర్ముని అవమానించారు. మమతా బెనర్జీకి కూడా ఫామ్‌హౌసు ఉండే ఉంటుంది. ఎన్నికల తర్వాత దాని అవసరం పడొచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Suriya’s Scene: A Big Risk for Naslen’s Debut?

Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, actor Suriya…

22 minutes ago

Mouli’s Donga Naa Koduku Gets Release Date

Mouli has become a familiar name through his social media work, web series and Little…

43 minutes ago