
పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం మమతా బెనర్జీ అనే పేరు వినపడగానే సాదా కాటన్ చీర, కాళ్ళకు హవాయి చెప్పులతో నిరాడంబరమైన ఆమె రూపం కళ్ళ ముందు మెదులుతుంది.
కానీ కాటన్ చీర, హవాయి చెప్పులు ధరించి ఆమె నిరాడంబరంగా కనిపించవచ్చేమో కానీ ఆమె (తృణమూల్ కాంగ్రెస్) పార్టీకి చెందిన మూడు బ్యాంక్ ఖాతాలలో కలిపి మొత్తం రూ.804 కోట్లు ఉన్నాయి! ఏకధాటిగా పదిహేనేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ మాత్రం బ్యాంక్ బ్యాలన్స్ సహజమే అని సరిపెట్టుకోక తప్పదు.
శాసనసభ ఎన్నికలలో ఆమె పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో ఓ ముఖ్య నేత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమదేనంటూ తిరుగుబాటు చేశారు. దీంతో ఈ వందల కోట్ల ఆస్తులను ఫ్రీజ్ చేసి వాటిపై ఎవరికి అధికారం ఉందనే దానిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.
ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదు. కనుక వందల కోట్లు ఎదురుగానే ఉన్నా మమతా బెనర్జీ కూడా వాటిని వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.
త్వరలో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. పార్టీ నిర్వహణ ఖర్చులు నెలకు సుమారు రూ.12.50 కోట్లు వరకు అవసరమని కనుక ఆ ఆస్తులను పాక్షికంగానైన వాడుకునేందుకు తమను అనుమతించాలంటూ మమతా బెనర్జీ వర్గం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేసింది.
ఈ ఆస్తులను స్తంభింపజేయడం ద్వారా దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని, కనుక న్యాయస్థానం తమ రాజకీయ హక్కులను కాపాడుతూ, పార్టీ ఆస్తులను ఉపయోగించుకునేందుకు అనుమతించాలని కోరింది.
ఈ కేసు విచారణలో మరో కొత్త విషయం కూడా బయటపడింది. మమతా బెనర్జీ అధికారంలో ఉన్నప్పుడు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలకు అప్పగించి, ఆ వచ్చిన సొమ్ముని పార్టీ ఖాతాలలో జమా చేసుకుందని, రాష్ట్ర ప్రభుత్వం తరపు వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలియజేశారు.
ఈ క్విడ్ ప్రో కేసుపై వేరేగా విచారణ జరుగుతోంది కనుక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలలో గల ఆస్తులు ఎవరూ వాడుకోకుండా ఫ్రీజ్ చేసి ఉంచాలని వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు మమతా బెనర్జీ వర్గం అభ్యర్ధనని తిరస్కరించింది.
Chandoo Mondeti is quietly putting together a combination that looks very different from his earlier…
India is one of the biggest economies in the world, and it is certainly the…