
Mamitha Baiju draws Rashmika comparisons
కన్నడ సినిమాలతో వెండితెరకు పరిచయమై, తర్వాత పరాయి భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ అయిపోయి, కన్నడ ఇండస్ట్రీని లైట్ తీసుకుంది రష్మిక. ఆ విషయంలో కన్నడ ఆడియన్స్ ఆమెను ఇప్పటికీ తిట్టిపోస్తుంటారు. అయితే.. రష్మిక విజయ్ ని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది కాబట్టి ఆమెను పట్టించుకోవడం మానేశారు.
ఇప్పుడు మమిత పరిస్థితి కూడా ఇంచుమించుగా అలానే ఉంది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించి, సూపర్ శరణ్యతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకొని “ప్రేమలు”తో హీరోయిన్ గా మారి సూపర్ సక్సెస్ అందుకున్న తర్వాత వరుసబెట్టి తమిళ సినిమాలు చేస్తూ ఆల్మోస్ట్ చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది.
2024లో వచ్చిన “ప్రేమలు” అనంతరం 5 తమిళ సినిమాలు చేసింది మమిత. రెండేళ్ల తర్వాత మలయాళంలో “బెట్లెహం కుటుంబ యూనిట్” అనే సినిమా చేస్తోంది. నివిన్ పౌలీ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 21న విడుదలకు సిద్ధంగా ఉంది. సరిగ్గా 10 రోజులు కూడా లేని ఈ సినిమా ప్రమోషన్స్ కి టైమ్ ఇవ్వడం లేదట మమిత.
సాధారణంగా మలయాళంలో మీడియా ఇంటర్వ్యూలు రిలీజ్ కి రెండువారాల ముందు ఇస్తారు. మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్లు కూడా ఫాలో అయ్యే పద్ధతి ఇది. ప్రస్తుతం విశ్వనాథ్ & సన్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నానని చెప్పి సోషల్ మీడియా పోస్టులతో సర్దిపెడుతుంది మమిత. దాంతో చేసేదేం లేక నివిన్ పోలీ సోలోగా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు.
చూస్తుంటే.. మమితను మలయాళ ఇండస్ట్రీ దూరం పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. మమిత కూడా తమిళంలోనే మూడు సినిమాలు సైన్ చేసింది కానీ.. మలయాళంలో మరో సినిమా ఒప్పుకోలేదు. మలయాళం కంటే తమిళంలో రెమ్యునరేషన్ ఎక్కువ ఉండడమే ముఖ్య కారణం అయ్యుండొచ్చు. గతంలో నయనతార కూడా ఇలానే చేసినప్పటికీ.. ఆమె మధ్యమధ్యలో మలయాళ సినిమాలు చేస్తూ మ్యానేజ్ చేసింది. ఇప్పుడు రెగ్యులర్ గా మలయాళంలో నటిస్తోంది. మరి మమిత కూడా అదే పద్ధతిని ఫాలో అవుతుందా లేక రష్మికలా మాతృభాషను మొత్తానికి వదిలేస్తుందా? అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…