
ఈ ఏడాది మే నెలలో కదిరెనహళ్లి సమీపంలో వాటర్ లీకేజీ మరమ్మత్తుల కోసం రోడ్డు తవ్వుతుండగా కొన్ని రాళ్లు బయటపడ్డాయి. ఆ సమీపంలోనే నివసించే శివతారక్ దృష్టిని ఆ రాళ్లు ఆకర్షించాయి. వాటిని తీసుకెళ్లి శుభ్రపరిచినఆయన, అవి రాతియుగం నాటి మనుషుల పనిముట్లని నిర్ధారించుకున్నారు. గతంలో ఇటువంటి రాతి పనిముట్లనే తుముకూరు, మాండ్య, చిత్రదుర్గ జిల్లాల్లో కనుగొన్నారు.
శివతారక్ కనుగొన్న ఐదు పనిముట్లలో ఒకటి చేతి గొడ్డలి, చిన్న కత్తి లాంటి సాధనం, ఆకులా ఉండే పనిముట్టు, రాతి సుత్తి, చిన్న చేతి గొడ్డలి ఉన్నాయి. క్వార్ట్జ్ రాయితో తయారైన ఇవి 7-11 సెంటీమీటర్ల పొడవు 4-7 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్టు పేర్కొన్నారు. అప్పట్లో మనషుల ప్రధాన వృత్తి వేట కావడంతో ఈ ఆయుధాలను వివిధ రకాలుగా ఉపయోగించే వారని శివతారక్ తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరు ఉన్న ప్రాంతానికి రాతియుగం నాటి మానవులు వలస వచ్చి ఉండొచ్చని కర్ణాటక యూనివర్సిటీ ఆర్కియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవికోరి శెట్టర్ పేర్కొన్నారు. బెంగళూరు చుట్టూపక్కల ఎక్కడా పాతరాతి యుగం నాటి ఆనవాళ్లు లేవన్నారు. ప్రస్తుతం తవ్వకాల్లో లభ్యమైనా క్వార్ట్జ్ రాయి నిల్వలు ఈ ప్రాంతంలో లేవని, ఉత్తరాదితో పాటు తుముకూరు సమీపంలోని కిబ్బనహళ్లిలో మాత్రమే ఉన్నాయని వివరించారు. దీనిని బట్టి చూస్తే పాతరాతి
ఇతర రాష్ట్రాల సంగతి పక్కన పెడితే, ఆంధ్రాలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆప్యాయత మాటల్లో, చేతల్లో కనబరుస్తారే తప్ప బహిరంగంగా ఒకరినొకరు…
Choreographer Sekhar Master met with a road accident near Shamshabad while returning from a song…