
ఇటీవల స్థానిక టిడిపి సీనియర్ నేత నంబూరి వెంకట రామరాజు (తాడినాడ బాబు) ఊర్లో గణేశ్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత లెక్కలు చూడగా సుమారు రూ.2.50 లక్షలు నగదు మిగిలింది. దాంతో ఏమి చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ ఆలోచించిన తర్వాత తాడినాడ-చినతాడినడ మద్య రోడ్డు పూర్తిగా గుంతలు పడి ద్విచక్రవాహనాలు కూడా ప్రయాణించలేని స్థితిలో ఉందని గుర్తించి ఆ సొమ్ముతో ఆ రోడ్డుమీద గుంతలనీ పూడ్చేశారు. అప్పటి నుంచి ఊరి ప్రజలు హాయిగా ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. చాలా మంచి పనిచేశారని అందరూ తాడినాడ బాబును మెచ్చుకొంటున్నారు.
ఇది స్థానిక వైసీపీ నేతలకి అభ్యంతరకరంగా కనిపించింది. వారి ఫిర్యాదు మేరకు ఆర్ అండ్ బి అధికారులు రోడ్డును పరిశీలించి, తమ అనుమతి తీసుకోకుండా గుంతలను పూడ్చేసినందుకు తాడినాడ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కైకలూరు సీఐ వైవిఎల్ నాయుడు కేసు నమోదు చేసి ఆయనకు నోటీస్ పంపించారు. ఈ కేసులో విచారణ నిమిత్తం కలిదిండి పోలీస్ స్టేషన్‌కు రావలసిందిగా నోటీసులో కోరారు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…