
డబ్బులకు కొదవలేని కొందరి సినీ సెలబ్రిటీల జీవితాలకు ఐ ఫోన్ 7 ప్లస్ ధర పెద్దగా అనిపించకపోవచ్చు. అయితే దానిని పొందిన సమయంలో వారికి లభిస్తున్న ఆనందం మాత్రం పెద్దగానే ఉందని మంచు వారమ్మాయి ఫోటో చూస్తే తెలిసిపోతోంది. ‘నా ఐ ఫోన్ 7 ప్లస్ వచ్చేసింది… హీ…హా… అంటూ నా కంటే ఆనందంగా ఉండే వారెవరూ లేరు’ అంటూ తెగ సంబరపడిపోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలాంటి సెలబ్రిటీలను చూసే సామాన్యులలోనూ ఇలాంటి ఫోన్ల పట్ల విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. గతంలో ఐ ఫోన్ 6 కోసం ఓ విదేశీ మహిళ నడిరోడ్డుపైనే వివస్త్రగా మారి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే మన దేశంలో కొన్ని మర్డర్లు కూడా నమోదైన ఉదంతాలు ఉన్నాయి. మరి సెలబ్రిటీలోనే ఇంతటి క్రేజ్ ఏర్పరచుకున్న ఐ ఫోన్ 7 ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…