
Manchu Manoj's Namaste World Investment
సినిమా రిలీజ్ ముందు టికెట్స్ ధర పెంపు, అదనపు షోలు వేసుకునేందుకు అనుమతి కోరే సమయంలో తప్ప తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తుండదు. కనుక రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలతో సంబంధమే లేనట్లు వ్యవహరిస్తుంటుంది.
విశాఖలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి వందలాది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వచ్చారు. కానీ తెలుగు సినీ పరిశ్రమ తరపున ఒక్కరూ హాజరు కాలేదు. అసలు ఈ సదస్సు జరుగుతున్నట్లు తెలుసో లేదో?
కానీ సినీ నటుడు మంచు మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక రెడ్డి ఇద్దరూ ఈ సదస్సులో పాల్గొనడమే కాకుండా రూ.36 కోట్ల పెట్టుబడితో కర్నూలు జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు కూడా. వారు స్థాపించిన ‘నమస్తే వరల్డ్’ స్టార్టప్ తరఫున ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పిల్లల ఆట బొమ్మలు, హస్తకళా ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
దీని ద్వారా స్థానిక కళాకారులకు ఉపాధి కల్పించడంతో పాటు స్వదేశీ కళలకు ప్రోత్సాహం అందించనున్నారు. ‘నమస్తే వరల్డ్’ వ్యవస్థాపకురాలు భూమా మౌనిక రెడ్డి ఈ ఎంఓయూపై సంతకం చేశారు.
అనంతరం ఆమె సదస్సులో మాట్లాడుతూ, ఈ సదస్సు ద్వారా హస్తకళాకారులు, యువ పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపైకి రావడం చాలా సంతోషంగా ఉంది. స్థానిక కళాకారులను, వారు తయారుచేసే బొమ్మలు, హస్తకళలను, వారి కోసం ప్రారంభించిన మా వంటి స్టార్టప్ కంపెనీలను ఈ సదస్సు ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసినందుకు ఆమె ఏపీ ప్రభుత్వం, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
మంచు మనోజ్ దంపతులు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అనేక ఎదురు దెబ్బలు తిన్నారు. అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. వారితో పోలిస్తే మిగిలిన సినీ ప్రముఖులు చాలా విలాసవంతమైన జీవితాలే గడుపుతున్నారు. సినిమా అవకాశాలు, ఆదాయపరంగా చూసినా మంచు మనోజ్ కంటే ఎన్నో రెట్లు మిన్నగా ఉన్నారు.
కానీ అంతమందిలో ఏ ఒక్కరూ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. కనీసం ఈ సదస్సుకు రావాలనుకోలేదు.
కానీ తమ సినిమా రిలీజ్ ముందు టికెట్ ఛార్జీల పెంపు, అదనపు షోల కోసం ప్రభుత్వం నుంచి సాయం పొందుతూనే ఉన్నారు. ప్రభుత్వం కూడా వారిపట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తుంటుంది. అవసరమా?
ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి కూడా ఈ సదస్సులో పాల్గొని త్వరలోనే ఏపీలో సినీ పరిశ్రమకు సంబందించిన ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
If someone asks about Ram Charan's best-known films, RRR, Magadheera and Rangasthalam would naturally come…
There has been considerable speculation surrounding NTR and Trivikram's much-awaited film tentatively titled God of…