
యాక్షన్ సన్నివేశాలలో భాగంగా బైక్ పై మంచు విష్ణు పాల్గొన్న పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో… బైక్ పై నుండి జారిపడిన మంచు విష్ణు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బలమైన గాయం తగిలిందని తెలుసుకున్న చిత్ర యూనిట్, వెంటనే షూటింగ్ కు పేకప్ చెప్పి విష్ణును స్థానిక హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లుగా మీడియా వర్గీయుల ద్వారా తెలియనుండగా, దీనిపై మరింత అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ఐసీయూలో చికిత్స అనే పాటికి అభిమానులు కాస్త కంగారుపడం సహజం. దీంతో మంచు విష్ణు ఆరోగ్య పరిస్థితిపై చిత్ర యూనిట్ కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా వెల్లడిస్తే, అభిమానుల ఆందోళనను తగ్గించిన వారవుతారు. బహుశా ‘కలెక్షన్ కింగ్’ అయినా ఓ ప్రెస్ మీట్ పెట్టి, తన మొదటి తనయుడు ఆరోగ్య పరిస్థితిని వివరిస్తే బాగుంటుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు బ్రహ్మానందం కూడా టైటిల్ రోల్ లో కనిపించనున్న విషయం తెలిసిందే.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…