
‘ఎంటర్టైన్మెంట్’ను సాగదీస్తే ఎంత విసుగు వస్తుందో, ఈ రెండు నిముషాల ట్రైలర్ చూడడానికే ప్రేక్షకులకు అంత విసుగు వస్తుంటే, రేపు ధియేటర్ లో పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ట్రైలర్ అంటే కనీసం ఓ రెండు నిముషాల పాటు ఉండాలన్న సూత్రాన్ని అవలంభించి కట్ చేసినట్లుగా ఉన్నారు తప్ప, ఈ కధను ప్రేక్షకులకు దగ్గర చేద్దామనే భావన ఈ “లక్కున్నోడు” ట్రైలర్ లో ఇసుమంత కూడా కనపడలేదు. ట్రైలర్ కటింగ్ ఎప్పుడూ షార్ప్ గా లేని పక్షంలో ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
బహుశా తమ లక్కీ హీరోయిన్ హన్సిక ఈ “లక్కున్నోడు”ను గట్తెక్కిస్తుందేమోనని భావిస్తున్నారేమో గానీ, గతంలో ‘బొద్దుగుమ్మ’గా ఉన్న ఈ బొమ్మ కాస్త చిక్కి, చక్కనమ్మలా తయారయ్యింది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. గతంలో వరుసగా వర్మ సినిమాలను నిర్మించిన సత్యనారాయణ, తాజాగా ఈ “లక్కున్నోడు” సినిమా ద్వారా రాబోతున్నారు. ప్రవీణ్ లక్కరాజు, అచ్చు ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే… ప్రేక్షకులను ధియేటర్ల వైపుకు నడిపించేదిగా ఈ ట్రైలర్ కనపడడం లేదు.
Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana, is generating strong buzz not…
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…