
సార్వత్రిక ఎన్నికలను తలతన్నేలా ఒకరి మీద మరొకరు అత్యంత నీచమైన విమర్శలు చేసుకుంటూ ఇదంతా తెలుగు సిని’మా’ ఇండస్ట్రీ కోసమే…అంటూ ప్రత్యక్షంగా తలపడుతూ ‘మా’…కోసమే అంటూ పరోక్షంగా రాజకీయాలు చేస్తున్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో తలపడే నటీనటులు.
ఎప్పటికప్పుడు MAA ఎన్నికల సందర్భంలో నటీనటుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో తెలుగు ఇండస్ట్రీ పరువు మీడియా ఛానెల్స్ లో డిబేట్స్ వరకు చేరి సినీ అభిమానుల సహనాన్ని పరీక్షించడంతో పాటు టాలీవుడ్ ప్రతిష్టను దిగజారుస్తుంది. గత మా ఎన్నికలలో తలపడిన మంచు విష్ణు ప్యానెల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల మధ్య మాటల యుద్ధం దాటి చేతుల యుద్ధం స్థాయికి చేరింది.
ఎన్నికల సమయంలో మంచు విష్ణు కు మద్దతుగా ఉన్న మంచు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులలో ఒకరైన బెనర్జీ పై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఇలా మాటల దాడి నుంచి చేతల దాడి స్థాయికి చేరాయి మా ఎన్నికలు. అయితే ఈసారి అనూహ్యంగా ఎటువంటి హడావుడి లేకుండా, విమర్శలు, ప్రతివిమర్శలు చేయకుండా యూనానిమస్ గా ఎన్నికల తంతుని పూర్తి చేసింది మా.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణుకే మరో సారి అవకాశం అందించారు మా సభ్యులు. 26 మంది కమిటీ సభ్యులు విష్ణు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనితో ఈసారి ఎన్నికలు లేకుండానే ఆయన రెండవసారి ‘మా’ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈసారి మా ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో మీడియా వారికీ మంచి విందు భోజనం మిస్సయ్యింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
Aadarsha Kutumbam - AK47 was recently postponed again, and there is still no clarity about…
The USCIS has officially removed the 540-day automatic extension granted to H-4 visa holders with…