
అయితే మాజీ ఎంపీ మందా జగన్నాథంను దిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. గతంలో లోక్‌సభాపక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉన్నందున దిల్లీలో కేంద్ర ప్రభుత్వంతోని అపరిష్కృత అంశాలు, కేంద్ర మంత్రులతో చర్చలు, సంప్రదింపులు తదితర అంశాల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది.
దీంతో పాటు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. వివిధ పార్టీలతో సంప్రదింపుల కోసం దిల్లీలో ఏర్పాటు చేయనున్న కార్యాలయంలో సమన్వయకర్తగా ఆయన్ను నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలూ లేదు చూలూ లేదు ఢిల్లీలో ఆఫీసు దానికి సమన్వయకర్త.. రాజకీయ నిరుద్యోగుల సహాయార్ధం చేసే పనులు కాకా ఇంకేమిటి ఇవి?
భారత్‌లోనే ఒక రాష్ట్రం వాళ్ళు మరో రాష్ట్రంలో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా స్థిరపడితే పరాయి దేశస్థుడన్నట్లు చూస్తుంటారు. తమ ఉద్యోగాలు,…
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావు తప్పకుండా జైలుకి వెళ్తారని సిఎం రేవంత్ రెడ్డి చెప్పి ఇంకా 48 గంటలు…