
గత జనవరి 25న మందన, గౌరవ్ వివాహం జరుగగా, ఆరు నెలలు కూడా తిరక్కుండానే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. వివాహానికి ముందే హిందూ మతంలోకి మారాలంటూ తనను మానసికంగా వేధించి క్షోభకు గురి చేశాడని, వివాహానంతరం మోడలింగ్, నటనకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశాడని, అభ్యంతరమేంటని అడిగితే ఆ వృత్తి సమాజంలో తమ కుటుంబ హోదాకు భంగం కలిగిస్తుందని చెప్పాడని తెలిపింది.
తనను వేధింపులకు గురి చేసి, తన కెరీర్, బిజినెస్ కు నష్టం కలిగించినందుకు 2 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని, తన జీవన వ్యయానికి గాను ప్రతి నెలా పది లక్షల రూపాయలు ఇవ్వాలని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించేందుకు గౌరవ్ పీఆర్ నిరాకరించారు. ‘క్యా కూల్ హై హమ్’ వంటి సినిమాల్లో హాట్ పాత్రలో మందన కనువిందు చేసిన విషయం తెలిసిందే.
ఏపీలో జరిగిన స్థానిక ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ నేడు మొదలయ్యింది. అయితే ఇందులో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…
The legal pressure on YSRCP leaders is mounting, with the Enforcement Directorate summoning former minister…