Telugu

మంగళగిరి వైసీపీ మార్పులతో కాలక్షేపం చేస్తుందా.?

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోకి, రాష్ట్ర రాజకీయాలకు అత్యంత కీలక భిందువుగా ఉండే విజయవాడకు అత్యంత సమీపంలో ఉండే మంగళగిరి నియోజకవర్గం గత కొన్ని దశాబ్దాలుగా టీడీపీ పార్టీకి అందని ద్రాక్ష మాదిరి ఊరించింది.

2019 ఎన్నికలలో స్వయానా సీఎం చంద్రబాబు నాయుడు తనయుడిగా లోకేష్ బరిలోకి దిగినా టీడీపీ కి అనుకూల ఫలితం మాత్రం దక్కలేదు. దానికి తోడు వైసీపీ నుంచి లోకేష్ కి ఓటమి అవమానం ఎదురయ్యింది. వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే గా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి తన ప్రత్యర్థి అయిన లోకేష్ పై 5000 ఓట్ల మెజారిటీ తో 2019 లో గెలుపు జెండా ఎగరేసారు.

ADVERTISEMENT

అయితే మంగళగిరిలో ఆ గెలుపే వైసీపీ పార్టీకి చివరి విజయంగా మారుతుందని నాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం ఉహించి ఉండరు. 2019 – 2025 మధ్య ఉన్న విలువైన ఐదేళ్ల సమయాన్ని లోకేష్ టీడీపీ పార్టీ బలోపేతానికి వినియోగించుకున్నారు.

దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యే గా ఆర్కే రాజధాని అమరావతి వినాశనానికి తనవంతు కృషి చేయడం, తాడేపల్లి లో పేదల ఇల్లు కూలగొట్టం వంటి కార్యక్రమాలతో వైసీపీ ని భూస్థాపితం చేసుకున్నారు. ఇక 2024 ఎన్నికలకు నారా లోకేష్ కు ప్రత్యర్థిగా బరిలోకి దిగే వైసీపీ అభ్యర్థి ఎవరన్నది కూడా స్పష్టత లేకుండా పోయింది.

మాజీ ఎమ్మెల్యే ఆర్కే అరాచకాలతో మంగళగిరిలో వైసీపీ గెలుపు అసాధ్యమని భావించిన పార్టీ అధిష్టానం ఆయనకు బదులు అనేకమంది పేర్లను తెరమీదకు తెచ్చినా చివరికి మురుగుడు లావణ్య ను బరిలోకి దింపారు. అయితే అప్పటికే మంగళగిరి ప్రజల మనసులో లోకేష్ గెలుపు అనధికారికంగా నిర్ధారణ అయిపొయింది.

ఇక 2024 ఎన్నికలలో లోకేష్ ఓడిన చోటే సుమారు 90 వేల పై చిలుకు మెజారిటీతో గెలిచి, దశాబ్దాల టీడీపీ కలను నిజం చేస్తూ మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేశారు. ఓటమితోనే వెనకడుగు వేయని లోకేష్ ఇక తనకు 90 వేల మెజారిటీ కట్టబెట్టిన ప్రజలను వదులుకుంటారా.?

మంగళగిరి ప్రజల దశాబ్దాల కోరికగా నిలిచిన పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ‘మన ఇల్లు – మన లోకేష్’ పేరు మీద శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజాదర్బార్ నిర్వహిస్తూ స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. నిడమర్రు లో తన సొంత నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల రాష్ట్రానికే తలమానికంగా నిలిచింది.

ఇక మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలలో స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు, పార్కుల పునరుద్ధరణ, దేవాలయాల ఆధునికీకరణ వంటి అనేక కార్యక్రమాలతో ఏపీలో మంగళగిరిని ఒక ఆదర్శ నియోజకవర్గంగా మార్చేందుకు నిత్యం శ్రమిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలలో లోకేష్ కు ధీటుగా వైసీపీలో మంగళగిరి నుంచి పోటీకి సై అనే నాయకుడు కోసం వైఎస్ జగన్ ఇప్పటికి తర్జనభర్జన పడుతూనే ఉంటున్నారు. మొన్న ఆర్కే స్థానాన్ని భర్తీ చేసేందుకు దొంతి రెడ్డి వేమారెడ్డిని వైసీపీ మంగళగిరి ఇంచార్జ్ గా నియమించిన జగన్ నేడు ఆయనకు బదులు బుర్రముక్కల వేణుగోపాల సోమిరెడ్డి ని రంగంలోకి దింపారు.

పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తగా తాడేపల్లికి చెందిన వైసీపీ పార్లమెంట్ రాష్ట్ర పార్లమెంట్ రాష్ట్ర కార్యదర్శిగా బుర్రముక్క వేణు ని నియమిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేసారు.

అయితే మంగళగిరిలో లోకేష్ ని తట్టుకుని వైసీపీ జెండా ఎగరేసే నాయకుడు కోసం జగన్ ఇంకెంతకాలం ఎంతమందిని మార్చుకుంటూ పోతారు. అయితే లోకేష్ తో ఢీ కొట్టి గెలవగలిగే అభ్యర్థి వైసీపీ లో ప్రస్తుతానికి లేరనే జగన్ భావిస్తున్నారా.? అందుకే ఇలా ఏడాదికి ఒకరిని మార్చుకుంటూ క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేస్తున్నారా.? మంగళగిరిలో వైసీపీ మార్పులతో కాలక్షేపం చేస్తుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Massive OTT Blow: A Blessing in Disguise for Tollywood?

A new buzz is making the rounds in Tollywood about a possible OTT shake-up for…

25 minutes ago

800 KMs Vs 9000 KMs Roads: PK Explains On Stage!

After recovering from a series of health-related complications, Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan…

40 minutes ago