Telugu

మంగళగిరిలో వైసీపీది స్వయంకృతాపరాధమా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన, రాజధాని ప్రాంత నియోజకవర్గమైన మంగళగిరిలో వైసీపీ అనుసరించిన వ్యూహాలు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చాయనే భావన సర్వత్రా వినిపిస్తుంది. 2014 రాష్ట్ర విభజన నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల వరకు మంగళగిరి నియోజకవర్గ ప్రాధాన్యతను అంచనా వేయడంలో వైసీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందనే చర్చ జరుగుతోంది.

మూడు పార్టీల కేంద్ర బిందువు గా ఉండే మంగళగిరిలో వైసీపీ ని రాజకీయంగా ముంచింది ఎవరు అనేదాని మీద కూడా విస్తృత చర్చ నడుస్తుంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే మూడు ప్రధాన పార్టీల కేంద్ర కార్యాలయాలు, అధినేతల నివాసాలు మంగళగిరి పరిధిలోనే ఉండటం విశేషం.

ADVERTISEMENT

వైసీపీ కేంద్ర కార్యాలయంతో పాటు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం, టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు ఉంటున్న ఉండవల్లి నివాసం, అలాగే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న కాజ కూడా ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తాయి.

ఇంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించి పార్టీకి బలమైన పునాది వేశారు. అయినా కూడా వైసీపీ వ్యూహాత్మక తప్పిదాలు – మారిన సమీకరణాలు ఈ నియోజకవర్గంలో వైసీపీ ని రాజకీయ సమాధి చేసాయి.

2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కేవలం 5 వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే, ఆ ఓటమి తర్వాత లోకేష్ నియోజకవర్గాన్ని వీడకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసుకున్నారు.

మరోవైపు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు స్థానికంగా ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయనే చెప్పాలి. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి బదులుగా మూడు రాజధానుల నిర్ణయానికి స్థానిక ఎమ్మెల్యే మద్దతు పలకడం, రాజధాని రైతుల ఆందోళనలు, అలాగే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లోని పేదల ఇళ్ల పట్టాల సమస్యలు మరియు కూల్చివేతల వంటి అంశాలు స్థానిక ఓటర్లలో తీవ్ర అసంతృప్తిని రగిల్చాయి.

ఈ పరిణామాల ఫలితంగా 2024 ఎన్నికల్లో నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించి, నియోజకవర్గంలో టీడీపీ జెండాను ఎగురవేశారు. ప్రస్తుతం మంగళగిరిలో లోకేష్‌కు దీటైన పోటీ ఇచ్చే బలమైన ఇన్‌ఛార్జ్‌ను నియమించుకోవడం కూడా వైసీపీకి సవాలుగా మారింది.

ఇక అతి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని టీడీపీ వ్యూహాలు రచిస్తున్న వేళ… మంగళగిరిలో వైసీపీ తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే మంగళగిరిలో ప్రస్తుతం వైసీపీ రాజకీయ దుస్థితికి మాత్రం ఆ పార్టీ అధినేత నుంచి ఆ పార్టీ స్థానిక నేతల స్వయంకృతాపరాధమే ప్రధాన కారణం అనే భావన రాజకీయ విశ్లేషకుల నుంచి వెలువడుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

LSG Ready To Sacrifice Shami For Sam Curran?

Mohammed Shami could leave Lucknow Super Giants (LSG) ahead of IPL 2027, with Rajasthan Royals…

22 minutes ago

Dhanush’s Om Faces Sensitive Political Controversy

One of the most controversial subjects in upcoming cinema is attracting attention with the film…

41 minutes ago