
రాణి ఝాన్సీ లక్ష్మీబాయ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణను వెంటనే ఆపాల్సిందిగా సర్వ బ్రాహ్మిణ్ మహాసభ అధ్యక్షుడు సురేశ్ మిశ్రా సోమవారం రాజస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. చారిత్రక వాస్తవాలు నాశనం కాకండా చర్యలు తీసుకోవాలని, సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండవని దర్శకనిర్మాతలు హామీ ఇచ్చాకే సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వాలన్నారు.
తమ డిమాండ్‌పై ప్రభుత్వం మూడు రోజుల్లోగా స్పందించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సినిమా విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, హోం మంత్రి గులాబ్ చంద్ కటారియాను కలవనున్నట్టు సురేశ్ మిశ్రా తెలిపారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ అధికారితో లక్ష్మీబాయ్‌కు లవ్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్టు తెలిసిందని మిశ్రా పేర్కొన్నారు.
జైశ్రీ మిశ్రా రాసిన వివాదాస్పద పుస్తకం ‘రాణి’ ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. ‘పద్మావత్’లా దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగకముందే సినిమా దర్శక, నిర్మాతలు, ప్రభుత్వం స్పందించాలని మిశ్రా కోరారు.
Shah Rukh Khan’s King has reportedly secured the biggest overseas distribution deal ever for an…
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…