
ఒక్కో సందర్భంలో సినీ సెలబ్రెటీలు తమ మూవీ ఈవెంట్ లలో చేసే కొన్ని వ్యాఖ్యలు వివాదాలుగా మారుతున్న వైనాలు చూస్తున్నాం. అయితే ఒక్కోసారి అవి ఉద్దేశపూర్వకంగా వాడబడినప్పటికీ కొన్ని కొన్ని సమయాలలో ఏమరపాటుగా చేసిన వ్యాఖ్యలు సైతం వేలెత్తి చూపిస్తాయి, క్షమాపణలు చెప్పేలా చేస్తాయి.
తాజాగా రాజాసాబ్ మూవీ ఈవెంట్ లో దర్శకుడు మారుతి చేసిన కాలర్ వ్యాఖ్యలు తారక్ అభిమానులను నొప్పించాయి, ఆ వ్యాఖ్యలు తమ అభిమాన హీరోని కించపరిచేలా ఉన్నాయంటూ ఎన్టీఆర్ అభిమానులు డైరెక్టర్ మారుతి పై సోషల్ మీడియాలో వార్ మొదలుపెట్టారు.
దీనితో మారుతి తన మాటల వెనుక అటువంటి ఉద్దేశాలు లేవని, కేవలం అవి అనుకోకుండా వచ్చిన వ్యాఖ్యలే అని ఎవరిని అగౌరవపడిచడమో, ఎవరి అభిమానుల మనోభావాలను దెబ్బతీయడమే తన ఉద్దేశం కాదంటూ తన వ్యాఖ్యల వలన బాధపడిన తారక్ అభిమానులకు క్షమాపణలు తెలుపుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.
అయితే రాజాసాబ్ ఈవెంట్ వేదిక మీద ఉన్న నిర్మాత SKN దర్శకుడు మారుతిని తొడకొట్టాలంటూ కోరగా అందుకు స్పందిన మారుతి తనకు తొడలు కొట్టడం, కాలర్లు ఎగరేయడం రాదని, ఎవరైనా అలా చేస్తే వారిని చూస్తూ చప్పట్లు కొట్టడం మాత్రమే వచ్చాన్నారు.
ఈ సందర్భంగా మారుతి చేసిన కాలర్ ఎగరేయడం అనే పదం తారక్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యింది. అయితే ఈ వ్యాఖ్య చేసిన వెంటనే అందరు తారక్ – హృతిక్ వార్ – 2 ఈవెంట్ లో ఎన్టీఆర్ చేసిన కాలర్ ఎగరేసే దృశ్యాన్ని, ఆ సందర్భంగా తారక్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు.
అప్పుడే మారుతి వ్యాఖ్యలు వివాదంగా మారబోతున్నాయని, ఆయన తారక్ అభిమానుల ఆగ్రహానికి గురవ్వబోతున్నారని, ఆ వ్యాఖ్యల పై మారుతి క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని చాలావారకు ఊహించిందే.
అయితే ఆ క్షమాపణలు కేవలం కాలర్ తో ఆగుతాయా లేక తొడలు కొట్టే వరకు వెళ్లి అటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఇటు బాలయ్య అభిమానులను కూడా తాకుతాయా అన్నది ప్రశ్న.
వైసీపీ హయంలో ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషనలు, కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. వారిలో…
The Paradise is not just Srikanth Odela’s second film. It is also the director’s chance…