Telugu

కాక్రోచ్లకు అమెరికన్లు ఫండింగ్ చేస్తున్నారట….

నీట్ ఉద్యమంతో దేశ రాజకీయాలలో సంచలంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ చుట్టూ వివాదాలు చుట్టుముడుతూనే ఉంటున్నాయి. సీజేపీ కాంగ్రెస్ తోక పార్టీ ని కొందరు, సీజేపీ ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బినామీ పార్టీ ని మరికొందరు, సీజేపీ వెనుక దేశ ద్రోహుల హస్తం అని, విదేశీయుల ఫండింగ్ అని ఇలా సీజేపీ ఉనికి చుట్టూ అనేక వివాదాలు పరిభ్రమిస్తూనే ఉంటాయి.

జంతర్ మంతర్ కేంద్రంగా సీజేపీ చేపట్టిన నీట్ ఉద్యమం గమనిస్తే సీజేపీ పోరాటాలకు జెన్ జీ ల మద్దతు తో పాటుగా మరెవరి సహకారమైన ఉందా అన్న అనుమానాలు రేకెత్తాయి. అయితే తాజాగా సర్ కి వ్యతిరేకంగా, సీఈసీ జ్ఞానేశ కుమార్ రాజీనామా డిమాండ్ తో సీజేపీ మొదలుపెట్టిన కార్యక్రమాలతో సీజేపీ ఉద్యమాల వెనుక ఎదో బలమైన పొలిటికల్ మోటివ్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది.

ADVERTISEMENT

అయితే ఇప్పుడా అనుమానాలకు మరింత బలం చేకూర్చేలా అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ని, భారతదేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని విదేశీ శక్తులు తెరవెనుక పనిచేస్తున్నాయని,

భారత్ లో అభిజిత్ నేతృత్వంలో సీజేపీ చేస్తున్న ఉద్యమాల రాజకీయం వెనుక అమెరికాకు చెందిన కొందరు ఫండింగ్ ఉందని సంచలనమైన ఆరోపణలు చేసారు. సీజేపీ వంటి శక్తులతో చేతులు కలిపి దేశంలో అశాంతి, అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, భారతీయ యువత ఇటువంటి వారి కుట్రను తిప్పికొట్టాలని సూచించారు మేరీ.

అయితే మేరీ సీజేపీ పై చేసిన ఆరోపణలకు సీజేపీ ఫౌండర్ అభిజిత్ దూప్కే తిప్పికొట్టారు. తమ పార్టీ ఖాతాలో ఎటువంటి విదేశీ ఫండింగ్ లేదని అవన్నీ కేవలం ఆరోపణలే అని, ఒకవేళ ఆ ఆరోపణలలో వాస్తవాలు ఉంటే అది కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేతకాని తనమని షా టార్గెట్ గా ఎదురుదాడి మొదలుపెట్టారు.

అయితే తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్ గా, భారత బడా వ్యాపార వేత్త అంబానీ కేంద్రంగా అమెరికా దిగ్గజ వ్యాపార వేత్త మస్క్ చేసిన ఆరోపణలు ఈ కుట్రలో భాగమేనా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పుట్టుకొస్తున్నాయి. చూడాలి మరి రానున్న రోజులలో ఈ కాక్రోచ్ల మూలాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించాయి అనేదాని మీద స్పష్టత వస్తుందేమో…!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas Postponement Curse: Will Fauzi & Spirit Break It?

Prabhas and postponements have an interesting history. On several occasions, his films moved away from…

9 minutes ago

Romance Failed, Will Horror Save Kriti Sanon from Flops?

Kriti Sanon is ready to enter uncharted territory with her next big screen outing. The…

30 minutes ago