
సహజంగా ఇండస్ట్రీలో ఎప్పుడూ ‘వారసత్వం’దే డామినేషన్. కానీ ఇక్కడ ఉన్నది డబుల్ హ్యాట్రిక్ నాని కావడంతో పోటీ చాలా బలంగా ఉంది. ముందుగా విడుదలైన నాని “ఎంసీఏ” సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ రాకపోయినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఇటు ఏపీ, తెలంగాణాలలోనూ, అటు ఓవర్సీస్ లోనూ రికార్డు ఓపెనింగ్స్ ను దక్కించుకుని తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు.
అయితే రెండవ రోజు అందరి దృష్టి అఖిల్ “హలో” మీద పడడం, ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో… ఈ రెండు సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. పక్కా క్లాస్ సినిమాగా ‘హలో’ నిలువగా, రొటీన్ మాస్ ఎంటర్టైనర్ గా ‘ఎంసీఏ’ నిలిచింది. రెండు సినిమాలు జోనర్స్ వేరైనా… విక్రమ్ కే కుమార్ ట్రీట్మెంట్ తో ‘హలో’ సినిమా టాక్ పరంగా, విమర్శకుల ప్రశంసల పరంగా ఒక మెట్టు పైన ఉందన్నది వాస్తవం.
కేవలం రెండవ సినిమా చేస్తున్న అఖిల్ ను నానితో పోల్చడం సబబు కాదు గానీ, బాక్సాఫీస్ పరంగా అయితే ‘వారసత్వం’ అనే ఒక పదం అఖిల్ కు కొండంత అండగా ఉంది. దీంతో అటు టాలీవుడ్ వర్గాల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. ప్రేక్షకులు స్వయంకృషితో ఎదిగిన నానికి పట్టం కడతారా? లేక వారసత్వం ప్రభావం తమ మీద ఎంత ఉందో మరోసారి చాటిచెప్తారా? బహుశా ఈ వీకెండ్ కు ఫుల్ క్లారిటీ వచ్చేయొచ్చు.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…