
‘సక్సెస్’ మాట మరిచిపోయిన అల్లరి నరేష్ ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని మరోసారి రీమేక్ పైనే భారం వేసి “ఒరువడక్కన్ సెల్ఫీ” సినిమాను తెలుగులోకి తర్జమా చేసాడు. గత సినిమాలతో పోలిస్తే… అల్లరి నరేష్ కాస్త సెటిల్డ్ గా ఈ సినిమాలో కనిపించారు గానీ, అంతకుముందు ఉన్న కామెడీ టైమింగ్ ఎక్కడో మిస్సయినట్లుగా కనపడుతోంది. అయితే దీనిని సవరించేందుకే ‘హైపర్ ఆది’ని పెట్టుకోగా, దానికి పూర్తి న్యాయం చేసినట్లుగా కనపడుతున్నాడు. ‘జబర్దస్త్’ ఫ్లోనే కంటిన్యూ చేస్తూ నరేష్ పైన వేసిన పంచ్ లు కూడా బాగానే పేలాయి.
ఈ సినిమాకు ఆది ఒక్క కమెడియన్ మాత్రమే కాదు, రచయితగా కూడా కొనసాగాడు. తన పాత్రతో పాటు చంద్ర శేఖర్, ప్రసాద్ వర్మలతో కలిసి ఈ సినిమాకు డైలాగ్స్ అందించాడు ‘హైపర్ ఆది.’ మరి ఆది పంచ్ లతో అయినా అల్లరోడు తన స్థాయికి తగ్గ హిట్టును అందుకుంటాడో లేదో చూడాలి. ఆది మినహా ఈ ట్రైలర్ లో పెద్దగా చెప్పుకోవాల్సిన విషయాలు లేవు, అలాగే విమర్శించడానికి ఏమీ లేదు. కానీ అల్లరోడుకు గ్యారెంటీగా హిట్ ఇస్తుంది అన్న నమ్మకాన్ని అయితే ఇవ్వలేకపోయింది.
Watching Suriya and Dhanush together on the big screen would itself be an interesting prospect.…
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అనేది రాజకీయంలో సర్వసాధారణం. అధికారం శాశ్వతం అనుకుని హద్దులు దాటి వ్యవహరిస్తే చివరికి చెల్లించే…