Telugu

భోళా కి రివెంజ్… మెగా ఫ్యాన్స్ టార్గెట్ బాలయ్య

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రూపంలో పెద్ద డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. సినిమా ఫలితం ఊహించిందే అయినా మరీ ఆచార్య కంటే దారుణంగా పెర్ఫర్మ్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు.

మెగా ఫ్యాన్స్ ఆ టైం లో చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యారు…. దానికి తోడు యాంటీ- ఫ్యాన్స్ ట్రోలింగ్ ఉండనే ఉంటుంది. ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే సినిమా ఫలితం కంటే ఆ ట్రాల్స్ కి ఎక్కువ ఫీల్ అవుతారు. భోళా విషయంలో జరిగింది కూడా అదే. దానికి రివెంజ్ తీర్చుకోవడానికి రెడీ అయిపోయారు మెగా ఫ్యాన్స్.

ADVERTISEMENT

వాళ్ళ టార్గెట్ నందమూరి బాలకృష్ణ.

సహజంగా బాలకృష్ణ ఈవెంట్స్ ని పట్టించుకోరు మెగా ఫ్యాన్స్. అయితే ఇందులో కొంత మంది ఒక బృందంగా ఏర్పడి డేగ కళ్ళ తో స్కంద ఈవెంట్ ని పరిశీలించారు. సరదాగా చేసిన కొన్ని పనులను కూడా కావాల్సిన చోట్ల కట్ చేసి ఆ క్లిప్స్ తో బాలకృష్ణ ని బ్యాడ్ చెయ్యడానికి ఫుల్ గా ట్రై చేశారు.

ఉదాహరణకు బాలకృష్ణ మాట్లాడుతుండగా శ్రీలీల నవ్వు ఆపుకుంటుంది అంటూ ఒక వీడియో తిప్పారు. నిజానికి బాలయ్య, శ్రీలీల భగవంత్ కేసరి షూట్ లో బాగా క్లోజ్ అయిపోయారు.

బాలయ్య కోసం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు, కాన్సర్ హాస్పిటల్ ఈవెంట్ కు కూడా వెళ్ళింది శ్రీలీల.

ఇక బాలయ్య సరదాగా రామ్ ని ఏదో అంటే… అది సీరియస్ అన్నట్టు ప్రచారం చేసారు. దానికి ముందు వెనుక వారిద్దరూ ఒకరి తో ఒకరు క్లోజ్ గా ఉండటం, గొప్పగా మాట్లాడటం వదిలేశారు.

సోషల్ మీడియా లో ఆ వీడియోస్ తో నింపేశారు. వాళ్ళ ఫస్ట్ కాంపెయిన్ సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవాలి.

ఇక నెక్స్ట్ టార్గెట్ భగవంత్ కేసరి. సెప్టెంబర్ 1 న వచ్చే పాట నుండి పండగకు వచ్చే సినిమా వరకు అన్నీ టార్గెట్ చేస్తారు. ప్రతి సందర్భంలోనూ సినిమాని ఇబ్బంది పెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు.

అయితే వీరికి అవకాశం ఇవ్వకుండా కంటెంట్ ఇవ్వాలి అనిల్ రావిపూడి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bollywood Divided As Imran Khan Faces Exit Notice

Actor Imran Khan being asked to leave India has drawn mixed reactions from the film…

26 minutes ago

వైసీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చి చంద్రబాబుని వేలెత్తి చూపడమా?

స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…

1 hour ago