Telugu

వైసీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చి చంద్రబాబుని వేలెత్తి చూపడమా?

స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే ఉంది. ఓ పక్క సొంత పార్టీ… నేతల ప్రయోజనాలు కాపాడుకుంటూనే, మిత్ర ధర్మం పాటిస్తూ మూడు పార్టీలతో సీట్ల సర్దుబాట్లు చేసుకోవడం మామూలు విషయం కాదనే సంగతి ఒంటరిగా తిరిగే సింహానికి ఎలా తెలుస్తుంది?

సిఎం చంద్రబాబు నాయుడు సంగతి పక్కన పెట్టి, వైసీపీలో సీనియర్లకు జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారా? వారికి లేదా వారి అనుచరులకు లేదా వారు సూచించినవారికి సీట్లు ఇచ్చి గౌరవించారా?అంటే వైసీపీ ప్రకటించిన జాబితా చూస్తే కాదనే అనిపిస్తుంది.

ADVERTISEMENT

విజయనగరం జిల్లాలోని వైసీపీ పెద్ద దిక్కు బొత్స సత్యనారాయణకు ఇటీవల చిన్న శ్రీను వెళ్ళిపోవడంతో ఎదురుదెబ్బ తగిలింది. వెంటనే తన కుమార్తె అనూషని రాజకీయాలలోకి తెచ్చి భీమిలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమింపజేసుకున్నారు.

కనుక విశాఖ, విజయనగరంలో బొత్స కుటుంబ సభ్యులకు జగన్‌ అవకాశం కల్పిస్తారనుకుంటే, వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణిలకు మేయర్ అభ్యర్ధులుగా ఖరారు చేశారు.

అలాగే మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ తరపున గట్టిగా నిలబడి చంద్రబాబు నాయుడుతో పోరాడుతూ ఉంటారు. కనుక అయన సూచించిన వారిని మేయర్ అభ్యర్ధిగా ప్రకటిస్తారనుకుంటే, పార్టీలో మరో సీనియర్ నాయకుడు లంక సూరిబాబు సతీమణి లంక జ్యోతిని మచిలీపట్నం మేయర్ అభ్యర్ధిగా ఖరారు చేశారు.

ఇక వైసీపీ కంచుకోట కడపలో మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి సతీమణి బండి దీప్తి రెడ్డిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా సీనియర్ నేతలైన గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, రామసుబ్బారెడ్డి, సి. రామచంద్రయ్య, అంజాద్ భాషా, కడప మేయర్ కొత్తమద్ది సురేష్ బాబు తదితరులకు జగన్‌ షాక్ ఇచ్చారు.

ఇక విజయవాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి, అనంతపురంలో ఎవరెవరిని ఖరారు చేస్తారో, పార్టీలో ఎవరెవరికి ఎటువంటి షాకులు ఇవ్వబోతున్నారో నేడో రేపో తెలుస్తుంది. ఈవిధంగా వైసీపీలో సీనియర్లకు షాకులు మీద షాకులు ఇస్తూ, మళ్ళీ సిఎం చంద్రబాబు నాయుడుని వేలెత్తి చూపడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీకి పొత్తులు ఉంటే.. జగన్‌ ఎలా హ్యాండిల్ చేసేవారో?

కూటమి పార్టీల మద్య సీట్ల సర్దుబాట్ల ప్రక్రియ పూర్తయింది. తిరుపతి కోసం జనసేన, బిజేపి పట్టుబట్టినప్పటికీ చివరికి అది టీడీపికే…

10 minutes ago

Why Keep Returning to the Same Past, Anupama?

Anupama Parameswaran has been speaking about her painful past relationship for the last few months.…

33 minutes ago