Telugu

మెగాస్టార్ డిక్లేర్ చేసారు… సునీల్ నెంబర్ 1..!

కామెడీ హీరో సునీల్ నటించిన ‘జక్కన్న’ చిత్రం ఆడియో మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైంది. చాలా కాలం తర్వాత తనదైన శైలిలో చిరంజీవి గారి ప్రసంగం కొనసాగడం అభిమానులకు మిక్కిలి ఆనందం కలిగించే విషయం. ఈ సందర్భంగా మెగాస్టార్ గారి ప్రశంసల వర్షంలో సునీల్ తడిసి ముద్దయ్యాడు. “మూడు రోజుల క్రితం సునీల్ నాకు ఫోన్ చేసి ఈ ఆడియో కార్యక్రమానికి రావాలన్నాడు. నా 150 వ చిత్రం షూటింగ్ ప్రారంభమవడం, నైట్ షూటింగ్ కూడా ఉండటంతో నేను రాలేనని, ఈ కార్యక్రమాన్ని దాటవేద్దామని అనుకున్నాను. కానీ, సునీల్ చూపించే ఆప్యాయతను చూసి ‘నో’ చెప్పలేకపోయాను” అంటూ మెగాస్టార్ మార్క్ ప్రసంగాన్ని అభిమానులకు రుచి చూపించారు.

“స్టేజ్ లపై నా పాటలకు డ్యాన్స్ లు చేసి ఈ రోజు ఈ స్థాయికి వచ్చానని సునీల్ ఎప్పుడూ చెబుతుంటాడు. చాలా సంతోషం. ఎందుకంటే, ఒక అభిమాని అభివృద్ధిలోకి రావడాన్ని చూసి గర్వించేది తల్లిదండ్రులు. ఆ తర్వాత గర్వించేది నేనే. నన్ను అభిమానించే అభిమానులు కూడా అభివృద్ధిలోకి రావాలి. అప్పుడే నన్ను ప్రేమించే అభిమానులను చూసి గర్వపడుతుంటాను. అటువంటి స్థాయి ప్రతి అభిమానికి రావాలని కోరుకుంటాను. అటువంటి అభిమానుల్లో “నెంబర్ 1” గా ఉన్నటువంటి సునీల్ ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది” అంటూ చెప్తున్న మాటలకు సునీల్ లో పట్టరాని సంతోషం తారసపడింది. ఇక్కడితో ఈ మెగా ప్రసంగం ఆగిపోలేదు.

ADVERTISEMENT

“ఎవరైనా సినిమాల్లోకి రావాలి, రాణించాలి అనుకుంటే.. కష్టాన్ని నమ్ముకుంటే కచ్చితంగా వస్తారని చెప్పడానికి పెద్ద ఎగ్జాంపుల్ సునీల్ కంటే ఎవరూ ఉండరనుకుంటున్నాను. సునీల్ ను చూస్తుంటే నాకే ఆశ్చర్యమేస్తోంది. పుష్టిగా ఉండే సునీల్… బాడీ బిల్డర్ లాగా, కండల వీరుడిలాగా మారాడు. మనం అనుకుంటే ఏదైనా సాధించగలం అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అయిన సునీల్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ‘జక్కన్న’ క్లిప్పింగ్స్ లో సునీల్ డ్యాన్స్ చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. మనకున్న బెస్ట్ డ్యాన్సర్లలో సునీల్ ఒకడని చాలా గర్వంగా చెప్పగలం. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత వస్తున్న సునీల్ కు ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను” అంటూ ముగించారు మెగాస్టార్.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

SCOOP: Fauzi’s New Date to Repeat Dil Raju-Mythri War?

Prabhas’ Fauzi has been postponed from December 3, 2026, and the film could now be…

28 minutes ago

Ram Pothineni’s RAPO23 Completes Second Schedule

Ram Pothineni is working on his first film as a writer-director, #RAPO23. He is also…

48 minutes ago