
ఈ సినిమాపై మెగా హీరోలందరూ చాలా సందర్భాల్లో వారి వారి స్పందనలను తెలియచేశారు. కానీ ఇప్పటివరకూ బన్నీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా మొన్న ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు మెగా హీరోలందరూ వచ్చినా బన్నీ రాలేదు. దీనితో మెగా ఫ్యాన్స్ లోని కొంత మందే బన్నీని విమర్శిస్తున్నారు. దీనితో నష్టనివారణా చర్యలు చేపట్టాడు బన్నీ.
సినిమా విడుదలకు రెండు రోజులు ఉండగా చివరిగా సినిమా మీద తన స్పందన ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడు. అయితే చివరి నిముషంలో ఏదో వివాదానికి తెరదించడానికి నామ్ కే వాస్తే చర్యగానే బన్నీని విమర్శిస్తున్న మెగా అభిమానులు చూస్తున్నారు. చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం విషయంలో ఇలా ప్రవర్తించడం ఎంత మాత్రం తగదని, మేము ఈ విషయంలో బన్నీని క్షమించలేం అంటున్నారు.
ఇది ఇలా ఉండగా… ‘”సైరా నరసింహారెడ్డి’.. స్వాతంత్ర్య సమరయోధుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని, మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం. ఇది నిజంగానే తెలుగు చిత్రపరిశ్రమ గర్వంగా చెప్పుకునే విషయం. కొన్ని సంవత్సరాల క్రితం ‘మగధీర’ సినిమాని చూసినప్పుడు.. చిరంజీవి కూడా అలాంటి సినిమాలో నటిస్తే చూడాలనుకున్నాను. నా కోరిక నేటికి నెరవేరింది. మెగాస్టార్ చిరంజీవితో ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన నా బావ రామ్‌చరణ్‌కు అభినందనలు. ఒక తండ్రికి తన కుమారుడు ఇచ్చే గొప్ప బహుమతి ఈ సినిమా. ‘సైరా’ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. దర్శకుడు సురేందర్‌రెడ్డిపై గౌరవం మరింత పెరిగింది. ఈ సినిమా ప్రతిఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని నేను కోరుకుంటున్నాను.” అని బన్నీ తన మెస్సేజ్ లో అన్నాడు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…