
దీనిపై తర్వాత దర్శకనిర్మాతలు, హీరో కూడా వివరణ ఇచ్చుకున్నారు గానీ, అసలు తొలగించబడిన రాజ్ కిరణ్ పెదవి విప్పలేదు. కానీ, తాజాగా తొలిసారిగా ఈ ఉదంతంపై తెరవెనుక జరిగిన విషయాల గురించి రాజ్ కిరణ్ చెప్పడం ఇండస్ట్రీలో సంచలనాత్మకంగా మారింది. తాను నటిస్తున్నప్పటికే సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయిందని, రషెస్ చూసిన చిరంజీవి తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత కలిగించారంటూ అసహనం వ్యక్తం చేశారని రాజ్ గుర్తు చేసుకున్నారు.
సినిమాలో లీడ్ రోల్ రామ్ చరణ్ దా? లేక రాజ్ కిరణ్ దా? అని చిరంజీవి ప్రశ్నించినట్టుగా తనకు తెలిసిందని, దీంతో తనను ఆ సినిమా నుంచి తప్పించి, ఆ పాత్రకు కొన్ని మార్పులు చేసి ప్రకాష్ రాజ్ తో నటింపజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నుంచి తనను తప్పించడంపై ప్రకాష్ రాజ్ కూడా అడిగారని, అయితే మొత్తం సెటిల్ చేసేశాం అంటూ అతనికి సమాధానం చెప్పారని రాజ్ కిరణ్ చెప్పారు. తనకు ఇంకా 10 లక్షల రూపాయలు రావాలని, ఈ డబ్బుకు సంబంధించి నిర్మాత కానీ, రామ్ చరణ్ కానీ, కృష్ణవంశీ కానీ స్పందించడం లేదని అన్నారు.
ఓ నటుడితో ప్రవర్తించే విధానం ఇదేనా? అంటూ మండిపడిన రాజ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి మాత్రం తనకు తీరని అన్యాయం చేసారంటూ ఆవేదన వెలిబుచ్చుకున్నాడు. దీంతో సినీ ఇండస్ట్రీలో హీరోల డామినేషన్ ఏ స్థాయిలో ఉందో, కళ్ళకు కట్టినట్లుగా ఈ ఉదంతం చెప్పకనే చెప్తోంది. నిజానికి రాజ్ కిరణ్ చెప్పిన వ్యాఖ్యలు అప్పట్లో ట్రేడ్ అండ్ మీడియా వర్గాల్లో బాగానే హల్చల్ చేసాయి. రాజ్ కిరణ్ అద్భుతంగా పోషించడం వలన చెర్రీ తగ్గిపోయాడని, అందుకే మార్పులు చేసి ప్రకాష్ రాజ్ ను తీసుకున్నారని అప్పట్లో వినిపించాయి. మరి దీనికి మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి సమాధానం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…
The chief minister of Telangana Revanth Reddy had been touring Delhi for the last few…