
రోజురోజుకు హద్దు దాటుతున్న పాక్ కవ్వింపు చర్యలతో భారతీయులంతా భారత ఆర్మీ వ్యవస్థకు తమ పూర్తి మద్దతు తెలుపుతూ ‘భారత్ మాత కు జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు కూడా తమ తమ స్వీయ రాజకీయాలను పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు అండగా నిలుస్తున్నారు.
ఉగ్రవాదుల పెహాల్గమ్ దాడికి ప్రతిచర్యగా భారత్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ ఉగ్రస్థావరాల మీద విరుచుకుపడింది. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ మాత్రం పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉంటున్న భారత సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడింది.
అయితే ఈ దుస్సాహసానికి పాక్ “బన్యన్ ఉల్ మర్సుర్” అని పేరు పెట్టుకుని భారత్ పై డ్రోన్ల దాడికి సిద్దమయ్యింది. అయితే దీని మీద స్పందించిన భారతీయ ముస్లిం పార్టీ “MIM” చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అసలు ‘ఇస్లాం పేరు పలికే అర్హత’ కూడా పాకిస్తాన్ కు లేదంటూ పాకిస్తాన్ చర్యలను ఖండించారు.
పాకిస్తానీయులు బెంగాలీ ముస్లింలను పందులంటూ అవమానించారు, ఇండియన్ ముస్లింల పై దాడి చేస్తున్నారు, అమాయకులైన ఎంతో మందిని అకారణంగా చంపుతున్నారు, చిన్నారుల పైన దాడులకు పాల్పడుతున్నారు, మీరా “బన్యన్ ఉల్ మర్సుర్” పేరుతో దాడులకు పాల్పడుతుంది అంటూ పాకిస్తాన్ పై రెచ్చిపోయారు ఒవైసీ.
అలాగే పాక్ వెనక్కి తగ్గే వరకు ఇండియా కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు పంపారు. అయితే భారత దేశం ‘భిన్నత్వంలో ఏకత్వం’ అనే సిద్ధాంతంతో ముందుకెళ్తుంది, అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఇదే అంటూ పలువురు ఒవైసీ వ్యాఖ్యల పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాలో మేము ఎన్ని రాజకీయాలేనా చేసుకుంటాం, ఒకరి పార్టీ మీద ఒకరు ఎన్ని విమర్శలకేనా వెనుకాడం, కానీ దేశ రక్షణ విషయానికి వస్తే, పార్టీలకు అతీతంగా, కులాలకు, మతాలకు సంబంధం లేకుండా భారతీయులంతా ఏకమవ్వాలి, ఏకమవుతారు అనే దానికి MIM ప్రకటనలే నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…
కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి, సీజేపీ చేస్తున్న ఆందోళనలను నిశితంగా గమనిస్తే భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో అర్ధమవుతుంది.…