Telugu

సింగపూర్ ఏపీ బంధాన్ని కేంద్ర అడ్డుకుంటుంది?

సింగపూర్ ఏపీ బంధాన్ని కేంద్ర అడ్డుకుంటుంది? అంటే అవును అన్నట్టుగానే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మాటలు. అమరావతి రాజధాని ప్రాంతంలో సింగపూర్ ప్రభుత్వం తో కుదుర్చుకున్న ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులు ఎదురు అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టుపై సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రభుత్వం తో చర్చించారు. సింగపూర్‌ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాలని, ఈ చిక్కుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాలనే నిబంధన వాడుకుని కేంద్రం ఈ ప్రాజెక్ట్ వీలైనంత ఆలస్యం అయ్యేలా చేస్తుందని విమర్శ. చంద్రబాబుకు మంచి పేరు వచ్చే అన్నే ప్రాజెక్ట్లను కేంద్రం అడ్డుకుంటుందని విమర్శ చాల కాలం నుండి ఉంది. రాజకీయ అవసరాల కోసమే అని తెలియనిది కాదు.

1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్‌ కంపెనీలకు ఇస్తామని, వారు లేఅవుట్లు వేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వాటిని విక్రయించి ఆ పరిసరాలలో విరివిగా పెట్టుబడులు తెస్తాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే అమరావతి కావాల్సిన ఊపు చాల తేలికగా వస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?

A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…

3 hours ago

The Paradise Has Hype, But Is It Enough?

Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…

3 hours ago