Telugu

మంత్రి రోజా ఆన్‌ డ్యూటీ… ఆస్ట్రేలియాలో

రాష్ట్ర పర్యాటక మంత్రి బాధ్యత ఏమిటి?అంటే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విదాలుగా అభివృద్ధి చేయడం అనేది అందరికీ తెలిసిన జవాబు. కానీ పర్యాటక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మన రోజమ్మ ఎక్కువగా పర్యటించిన ప్రాంతాలు రెండే రెండు. ఒకటి తిరుమల శ్రీవారి ఆలయం. రెండు తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం.

ఆమె రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పర్యటించకపోయినా పర్వాలేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేకానేక పర్యాటక ప్రాంతాల గురించి, అక్కడి సమస్యల గురించి, వాటి అభివృద్ధికి గల అవకాశాల గురించి అధికారుల ద్వారానైనా తెలుసుకొని వాటిని పరిష్కరించి, అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించినా అందరూ సంతోషించేవారు.

ADVERTISEMENT

కానీ మంత్రి పదవి కోసం తహతహలాడిపోయిన రోజమ్మ ఆ పదవి లభించిన తర్వాత ఆ పదవిని, హోదాని అనుభవిస్తున్నారే తప్ప రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి చేసిందేమీ లేదు. మంత్రి పదవి ఇచ్చినందున ఆమె తన అనుచరులను వెంటబెట్టుకొని తిరుమల శ్రీవారి ఆలయంపై దండయాత్ర చేశారు తప్ప జిల్లాల పర్యటనకు వెళ్లలేదు.

ఆమె మంత్రి పదవి కోసం ‘జబర్దస్త్’ ప్రోగ్రామ్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. మంత్రిగా చేసేదేమీ లేదు కనుక హాయిగా కుటుంబంతో సహా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మన పర్యాటక శాఖ మంత్రి రోజమ్మ గారు.

ఆమె పర్యాటక శాఖ మంత్రి… విదేశీ పర్యటనలో ఉన్నారు కనుక పర్యాటక కార్యక్రమంలోనే ఉన్నారని సరిపెట్టుకోక తప్పదు. ఆమె విదేశీ పర్యటనకు వెళ్ళడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ రాష్ట్రంలో పర్యాటక రంగం కోసం ఏమీ చేయకుండా మంత్రి పదవిని, హోదాని, సౌకర్యాలను అనుభవిస్తూ పనిచేయకపోవడాన్నే తప్పు పట్టాల్సివస్తోంది.

నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అటు అనంతపురం, చిత్తూరు, నెల్లూరు నుంచి ఇటు వైజాగ్, శ్రీకాకుళం వరకు ప్రతీ జిల్లాలోను అనేక పర్యాటక ఆకర్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో అనేకం నేటికీ ఎటువంటి సౌకర్యాలకు, గుర్తింపుకు నోచుకోక దీనావస్థలో ఉన్నాయి.

ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొల్లేరు మంచినీటి సరస్సుకు ఒకసారి మంత్రి రోజమ్మ వెళ్ళిచూస్తే అక్కడ ఎంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయో చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అంతర్వేదికి వెళ్ళడానికి ఎటువంటి సౌకర్యాలు లేవనే సంగతి ఆమెకు తెలుసో తెలియదో?విశాఖకు మణిహారం వంటి రామకృష్ణా బీచ్‌ చూస్తే అక్కడ సముద్రం ఒడ్డు ఎంత కోతకు గురవుతోందో కనబడుతుంది.

ఇలా చెప్పుకొంటూపోతే అనేకానేక సమస్యలు ఉన్నాయి. కానీ రోజమ్మ పేరుకే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకోగలిగితే చాలు… వాటి ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తుంది. కనుక రోజమ్మ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాతైనా మంత్రి పదవికి న్యాయం చేస్తే బాగుంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేంద్రంతో కటీఫ్‌.. జగన్‌ సిద్దపడుతున్నట్లేనా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్‌లో ప్రెస్‌మీట్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్‌ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…

3 minutes ago

హైదరాబాద్‌ మెట్రో నష్టాలు 405 కోట్లు.. ఏపీ తప్పించుకుందిగా!

ఆలస్యం అమృతం విషం, అలాగే నిదానమే ప్రధానమనే రెండు మాటలు వినిపిస్తుంటాయి. ప్రభుత్వాలు వివిధ కారణాలతో ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం…

8 minutes ago