
మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఉప రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసేందుకు 5 రోజులు మధ్యంతర బెయిల్‌పై ఢిల్లీ వెళ్ళారు. ఏసీబీ కోర్టు బెయిల్ షరతు ప్రకారం నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకు లొంగిపోయారు. జైలు అధికారులు మళ్ళీ అయనని లోపలేసుకున్నారు.
కానీ మిథున్ రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి లేదా ప్రధాని పదవి చేపట్టబోతున్నరన్నట్లు ఆయన అనుచరులు చేసిన హడావుడి చూస్తే నవ్వొస్తుంది.
వేదపండితులు ఆయనకు వేదాశీర్వాదం అందించి అక్షింతలు చల్లి ఆశీర్వదించగా, ఆయన అనుచరులు శాలువా కప్పి పూలు జల్లుతూ జేజేలు పలికారు. ఆయన ఫోటోలున్న ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేసూ ఆయనను లోనికి సాగనంపారు.
ఎంపీగా ఉన్న ఓ వ్యక్తి ఇటువంటి కుంభకోణం చేయడం, ఆ అవినీతి కేసులో జైలుకి వెళుతుండటం రెండూ చాలా సిగ్గుచేటే.
కానీ అవినీతికి పాల్పడి బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు, మళ్ళీ జైల్లోకి వెళుతున్నప్పుడు ఇంత ఘనంగా స్వాగతం, వీడ్కోలు పలకడం చూస్తున్నప్పుడు, మిథున్ రెడ్డి వెళుతోంది జైలుకేనా?అని అనుమానం కలుగుతుంది.
అవినీతిని, అవినీతికి పాల్పడి జైలుకి వెళుతున్నవారికీ వైసీపీ ఇంత గొప్పగా కవరింగ్ ఇస్తుంటే, సామాన్య ప్రజలు ఈ మాయలో పడకుండా ఉంటారా? మళ్ళీ వైసీపీకి, మిథున్ రెడ్డికి ఓట్లు వేయకుండా ఉంటారా?
Prabhas and Sandeep Reddy Vanga’s Spirit continues to remain one of the most talked-about upcoming…
The commercial strategy surrounding the release of Peddi has exposed a worrying trend in regional…