Telugu

రాజీనామా డ్రామా… బెడిసికొడితే వైసీపీకి మొదటికే మోసం?

వైసీపీ ప్రభుత్వం ఒక సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి మరో సమస్యను సృష్టించుకొని తప్పించుకోవాలనుకొంటుంది ఎప్పుడూ! తాజాగా అమరావతి కోసం రైతుల మహాపాదయాత్ర ఉత్తరాంద్రలో అడుగుపెడుతున్నప్పుడు విశాఖలో దసపల్లా భూముల వ్యవహారం బయటపడగా, దానిని దృవీకరిస్తున్నట్లుగా విశాఖ సముద్ర తీరాన్న పచ్చటి ఋషికొండను తవ్వేసి మట్టిదిబ్బగా మార్చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం మొదలైంది.

విశాఖ, ఉత్తరాంద్ర జిల్లాలలో విలువైన భూములను కబ్జా చేసేందుకే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల డ్రామా ఆడుతోందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. కనుక వైసీపీ ప్రభుత్వం మళ్ళీ ప్రజల దృష్టి మళ్ళించేందుకే తమ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేత రాజీనామా డ్రామా మొదలుపెట్టించిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

ADVERTISEMENT

అయితే ఈ రాజీనామా డ్రామా వైసీపీ ప్రభుత్వం కొంప ముంచేలా ఉంది. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని ఉత్తరాంద్రలో వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే, కర్నూలులో న్యాయరాజధాని కావాలని కోరుతూ వైసీపీ నేతలు కూడా రాజీనామాలు చేయొచ్చు కదా?అనే వాదనలు మొదలయ్యాయి.

బిజెపి ఎంపీ టిజి వెంకటేష్ మరో అడుగు ముందుకు వేసి, “అసలు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం మొదట కర్నూలు సమైక్య రాష్ట్రానికి రాజధానిగా ఉండేది కానీ తర్వాత పరిపాలనా సౌలభ్యం కొరకు హైదరాబాద్‌కు తరలించారు. అయితే ఇప్పుడు తెలంగాణ విడిపోయింది కనుక రాయలసీమ జిల్లాలకు న్యాయం జరగాలంటే కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలి. సాధ్యం కాదనుకొంటే అమరావతినే రాజధానిగా ఉంచాలి. రాయలసీమ ఎమ్మెల్యేలందరూ పార్టీలకు అతీతంగా కర్నూలు రాజధానిగా చేయాలని కోరుతూ రాజీనామాలు చేసి రాయలసీమ పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి,” అని అన్నారు.

కనుక వైసీపీ ఏదో ఆషామాషీగా మొదలుపెట్టిన ఈ రాజీనామా డ్రామా దాని కొంపే ముంచేలా ఉంది. ఒకవేళ రాయలసీమలో ఈ వాదన పుంజుకొంటే వైసీపీకి మొదటికే మోసం వస్తుంది. మూడు రాజాధానుల సంగతి అటుంచి ముందు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండా కాపాడుకోవాలసి ఉంటుంది. అభివృద్ధి కోసం రాజీనామా అంటూ మొదలుపెట్టిన ఈ డ్రామా బెడిసి కొడితే వచ్చే ఎన్నికలలో రాయలసీమలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vijayawada Mayor Race: Is Chandrababu Behind ABV?

Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…

1 hour ago

AP Local Polls: YSRCP’s Loss, Congress’s Gain

Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…

2 hours ago