Telugu

బండ్ల… రోజా… నిజాలు బయటకొస్తున్నాయ్… ఇది తప్పుకాదా..?

ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న బండ్ల గణేష్, రోజాల నుండి ఎలాంటి పదజాలం వెలువడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ ఒక్కరు వెనక్కి తగ్గకపోవడంతో… లైవ్ లోనే అసభ్యకరమైన రీతిలో తిట్టుకుంటూ… సినీ ప్రేక్షకుల ముందు ఒకరి గుట్టును మరొకరు రట్టు చేసుకున్నారు. ఒక విధంగా పవన్ పై ఉన్న అతి అభిమానం, దురాభిమానం వీరిద్దరి చేత ఈ వ్యాఖ్యలు చేయించిందని చెప్పవచ్చు.

ఇద్దరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో… ‘ఎవరు ఏంటి?’ అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. దీంతో వీరి మాటల యుద్ధంలో భాగంగా వచ్చిన వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుంది. ఫైనల్ గా సదరు న్యూస్ ఛానల్ కు కావాల్సిన స్పైసి అయితే వారికి లభించింది, వారి చర్చా వేదిక కూడా సంపూర్ణం అయ్యింది గానీ, దీని ద్వారా వారి భాగోతాలు బట్టబయలు అవుతున్నాయని మాత్రం ఇద్దరూ గమనించలేకపోతున్నారు.

ADVERTISEMENT

‘పక్కనుండి పక్కలెక్కిస్తున్నావా పవన్ కళ్యాణ్ కి…’ అని రోజా ఒక పది మెట్లు దిగజారి మాట్లాడితే… ‘నువ్వు స్ట్రెయిట్ గా హీరోయిన్ అయ్యావ్ మరి…’ అంటూ బండ్ల మరో పది మెట్లు దిగజారి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటో ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. దీని వలన సినీ ప్రేక్షకులలో సినీ సెలబ్రిటీలపై ఎలాంటి సంకేతాలను పంపిస్తున్నారో కూడా ఆలోచించుకునే స్థితిలో ఇద్దరూ లేరని చెప్పవచ్చు.

ఇప్పటికే సినీ ఇండస్ట్రీ అంటే సామాన్య ప్రజలకు ఒక హార్రర్ మూవీలా కనపడుతోంది. అందుకే తెలుగు హీరోయిన్లు కరువైపోతున్నారు. వాటిని మరింత బలపరిచేలా, ఇంకా ధృవీకరించేలా బండ్ల గణేష్, రోజాలు వ్యాఖ్యానించడం అనేది, రాజకీయంగా ఎలా ఉన్నా గానీ, సినీ ఇండస్ట్రీ పరంగా అయితే… నిలదొక్కుకున్న పరిశ్రమకు ద్రోహం చేస్తున్నట్లే భావించవచ్చు. మున్ముందు అయినా ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయకుండా ఉంటారని ఆశిద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

చిన్న శ్రీను.. టీడీపికి లాభమా నష్టమా ఎంత శాతం?

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను హటాత్తుగా వైసీపీకి, పజెడ్పీ చైర్మన్‌ వంటి కీలక పదవికి రాజీనామా…

5 minutes ago

From Rowdy Wear to UNHYPE: Vijay’s Business Game Grows

Vijay Deverakonda is making another move outside cinema, and this time he is putting his…

52 minutes ago