
తొలుత ఏఆర్ రెహమాన్ పేరును అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతున్న నేపధ్యంలో… రెహమాన్ తప్పుకోవడంతో, అందరి చూపులు టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ అందించిన థమన్ పైనే పడ్డాయి. అది కూడా అద్భుతంగా ఉండడంతో, అంతా పక్కాగా థమన్ అని ఫిక్స్ అయిపోయారు. కానీ సినిమా మార్కెటింగ్ కావాలంటే థమన్ సరిపోడనే ఉద్దేశంతో… “బాహుబలి” బ్యాక్ గ్రౌండ్ వీరుడు కీరవాణిని రంగంలోకి దించుతున్నట్లుగా తెలుస్తోంది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి – కీరవాణి కాంబోలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడం ఈ సమాచారాన్ని మరింత బలపరిచేలా చేస్తోంది. అయితే కేవలం రాజమౌళి మరియు రాఘవేంద్రరావు సినిమాలను తప్ప, ఇటీవల కాలంలో బయట సినిమాలు చేయని కీరవాణి, ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. బరిలో ఉన్నది మెగాస్టార్ చిరంజీవి కావడంతో, పెద్దగా ఇబ్బందులు ఎదురుకాకపోవచ్చు అన్నది ట్రేడ్ న్యూస్.
Kind of creative choices that Ram Charan made after epic success of RRR are largely…
Nitesh Tiwari’s Ramayana is arriving at the theatres next week. Notably, the movie was marketed…