
ప్రధాని మోడీ గురువారం కర్నూలులో పర్యటనకు వచ్చినప్పుడు మంత్రి నారా లోకేష్‌తో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. నారా లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రధాని మోడీ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఏకాంతంగా మాట్లాడుతుంటారు.
రాజకీయ అవసరాల కోసం లేదా ప్రోతోకాల్ భేటీలు, మాట్లాడే మాటలు వేరు. ఈవిదంగా వ్యక్తిగతంగా అభిమానంతో మాట్లాడే మాటలు వేరు. మంత్రి నారా లోకేష్ తన సమర్దత, పనితీరు, నాయకత్వ లక్షణాలతో ప్రధాని మోడీ మనసులో ఇంత చోటు సంపాదించుకున్నారు. కనుక భవిష్యత్తులో నారా లోకేష్‌ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు.
ఇప్పటికైతే చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపడతారు?అనే ప్రశ్నకు నారా లోకేష్ అని టీడీపి, పవన్ కళ్యాణ్ అని జనసేన అనుకుంటాయి. కనుక భవిష్యత్తులో ఏదో రోజు వీరిద్దరిలో ముఖ్యమంత్రి పదవి ఎవరికనేది తేల్చుకోవలసి వస్తుంది.
అప్పటి రాజకీయ పరిస్థితులు, అవసరాలు, సమీకరణాలు, బలాబలాలు ఏవిదంగా ఉంటాయో తెలీదు. కనుక ఇదో సమస్యగా మారినా మారవచ్చు.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రధాని మోడీ నారా లోకేష్‌ని తన మంత్రి వర్గంలో తీసుకున్నా ఆశ్చర్యం లేదు. తద్వారా ఇంతవరకు రాష్ట్రానికే పరిమితమైన నారా లోకేష్, జాతీయస్థాయికి ఎదుగుతారు. దేశాభివృద్ధికి జాతీయ స్థాయిలో తన వంతు కృషి చేయగలుగుతారు.
పవన్ కళ్యాణ్ పట్ల కూడా ప్రధాని మోడీకి చాలా అభిమానం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఆసక్తులు, అభిరుచులు, ఆలోచన ధోరణి నారా లోకేష్‌తో పోలిస్తే చాలా భిన్నమైనవి. పవన్ కళ్యాణ్ సామాజిక సేవ, హిందూమతం పట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు.
కనుక దక్షిణాది రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్‌ని బీజేపి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉపయోగించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఉపయోగించవచ్చు. ఇందుకు ప్రతిగా పవన్ కళ్యాణ్‌కి ముఖ్యమంత్రి పదవి లభించేలా చేయవచ్చు.
ఇటువంటి ఏర్పాటుతో ఏపీ రాజకీయాలలో ముఖ్యమంత్రి పదవి కోసం ఘర్షణ నివారించడమే కాకుండా అందరూ లాభపడతారు కూడా. ఈవిదంగా జరుగుతుందా లేదా? సమాధానం వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలుస్తుంది.
A suspected honey-trapping and extortion racket has been busted in Assam’s Jorhat. The police arrested…
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో ఢిల్లీలో నిర్వహించిన ‘పైలట్ ప్రాజెక్ట్’ విజయవంతమైందని భావించిన సీజేపీ.. ఇప్పుడు కేంద్ర…