
ఇదే చనువుతో ఈ విషయమై జగన్ ని మోహన్ బాబు అడిగారట. ఇంతకీ, ఏ నియోజకవర్గం నుంచి తన కూతురికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని మోహన్ బాబు అడిగారంటే… చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి గానీ, శ్రీకాళహస్తి గానీ… ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి టిక్కెట్ కేటాయించాలని కోరారట. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో జగన్ కు అత్యంత సన్నిహితులు ఉండటం గమనార్హం. మంచు లక్ష్మికి టిక్కెట్ ఇవ్వాలని మోహన్ బాబు పట్టుబట్టడంతో, తనకు కొద్దిగా సమయం కావాలని చెప్పి జగన్ తప్పించుకున్నారట.
కాగా, చంద్రగిరి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జగన్ తో ఎంత సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి జగన్ కు సన్నిహితుడు. అదే విధంగా మంత్రి బొజ్జలపై పోటీ చేసి ఓడిపోయిన మరో వ్యక్తి కూడా జగన్ కు సన్నిహితుడే. ఈ ముగ్గురిని పక్కన పెట్టి, రాజకీయాలకు కొత్త వ్యక్తి అయిన మంచు లక్ష్మికి వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయిస్తారా అనే విషయమై ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…