Telugu

మోహన్ బాబు… అకారణంగా శత్రువులను పెంచుకున్న పాపం

మోహన్ బాబు మూడేళ్ళ తరువాత సన్ ఆఫ్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒకప్పటి కలెక్షన్ కింగ్ ఈ సారి మాత్రం కలెక్షన్ల మాట అటుంచి కనీసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేని పరిస్థితి. రికార్డు స్థాయిలో షోలు రద్దు అయ్యాయి అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

సినిమాలు ఎంచుకునే విషయంలో మంచు ఫ్యామిలీ వెనుకబడింది నిజమే అయితే మోహన్ బాబు ఏమీ ఆషామాషీ నటుడు కాదు. ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది. అయితే దానికి కూడా ఇప్పుడు మర్యాద లేదు. ఎందుకు అంటే మాత్రం స్వయంకృతాపరాధమే.

ADVERTISEMENT

చాలా ఏళ్ళగా మోహన్ బాబు, ఆయన కుటుంబం అకారణంగా శత్రువులను పెంచుకునే పనిలో పడ్డారు. ఇండస్ట్రీలో గానీ అటు రాజకీయంగా అన్నీ అనవసర వైరాలే. ఇందుకు ఉదాహరణే సినిమా విడుదలకు ముందు సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్. 2019లో చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు, ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రచారం చేశారు మోహన్ బాబు.

మెగా కుటుంబంతో వైరం కారణంగా జనసైనికులు, టీడీపీతో వైరం కారణంగా తెలుగు తమ్ముళ్లు మంచు కుటుంబానికి విరోధులే. ఏ రాజకీయ అనుబంధం లేని వారికి కూడా మేము లెజెండ్స్ అన్న వైఖరి కారణంగా లోకువే. అలాగని వైకాపా అభిమానులు కూడా మనవాళ్లే కదా అనుకోవడం లేదు.

పోనీ రాజకీయంగా ఏమన్నా లబ్ది పొందరా అంటే అది కూడా లేదు. పదవుల సంగతి కాదు కదా జగన్ నుండి కనీసం మర్యాద దక్కని పరిస్థితి. ఈ ప్రభావం మోహన్ బాబు ఒక్కరి మీదే కాకుండా మొత్తం కుటుంబం మీద పడటం గమనార్హం. మోహన్ బాబు పిల్లల సినిమాల పరిస్థితి కూడా దాదాపు ఇంతే.

ఇక పరిశ్రమలో ఎంతో కష్టపడి మా ఎన్నికలు గెలిచినా ఆ పదవి అలంకరప్రాయంగానే మిగిలిపోయింది. కనీసం పరిశ్రమకు సంబంధించిన మీటింగులకు కూడా ప్రభుత్వం పిలవదు.

ఎలాగోలా తిప్పలు పడి జగన్ మీటింగుకు వెళ్తే ఆ ఫోటో కూడా బయటకు ఇవ్వని పరిస్థితి. వెనక్కు తిరిగి చూసుకుంటే అకారణంగా శత్రుశేషం, సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న మర్యాద పోగొట్టుకోవడమే తప్ప ఎలాంటి ఉపయోగం లేకుండా అయిపోయింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

SS Rajamouli Curse Hits Early? Back-to-Back Disasters

Tollywood has a long-running joke about the so-called Rajamouli curse. The belief is that a…

1 minute ago

Pics: Divi Makes Navy Blue Saree Look Effortless

Divi Vadthya brings a polished dose of desi glamour to this striking navy blue saree…

32 minutes ago