Telugu

ఆంధ్రాకు మరో భారీ ప్రాజెక్ట్: శ్రీకాకుళంలో యూరియా ప్లాంట్

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రాబోతోంది. శ్రీకాకుళం జిల్లా మూలపేటలో ఏడాదికి 12.7 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో భారీ ఎరువుల (యూరియా) కర్మాగారం ఏర్పాటు కానుంది.

ADVERTISEMENT

రూ.13,500 కోట్ల పెట్టుబడితో దీనిని గెయిల్, కృషక్ భారతి కోఆపరేటివ్ లిమిటెడ్ కలిసి చేపట్టనున్నాయి. దీనికోసం నవంబర్ 12న విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది.

ప్రస్తుతం దేశానికి ఏటా సుమారు 4 కోట్ల టన్నుల యూరియా అవసరం కాగా, అందులో దాదాపు 27 శాతం దిగుమతుల ద్వారా సమకూరుతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్ ధరలు, యుద్ధాలు, ఇతర దేశాల ఆంక్షల ప్రభావం భారత్‌పై పడుతోంది. ఈ పరిస్థితుల్లో దేశీయంగా యూరియా ఉత్పత్తిని పెంచుకోవడం చాలా మంచి ఆలోచనే.

ఈ యూరియా ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఏడాదికి 12.7 లక్షల టన్నుల యూరియా దేశీయంగా అందుబాటులోకి వస్తుంది. అంటే దేశ ప్రస్తుత వార్షిక అవసరాల్లో సుమారు 3.2 శాతం ఈ ఒక్క ప్లాంట్ ద్వారా సమకూరుతుందన్నమాట.

అలాగే ఈ మేరకు విదేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కొంత తగ్గుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా, ఇతర దేశాల నుంచి సరఫరాలో ఆటంకాలు ఏర్పడినా ఈ ప్లాంట్ కొంత ఉపశమనం కల్పిస్తుంది.

ముఖ్యంగా వ్యవసాయాధారిత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. స్థానికంగా యూరియా ఉత్పత్తి జరగడం వల్ల రవాణా, నిల్వ, సరఫరా వ్యవస్థలు ఏర్పాటు అవుతాయి. కనుక ఆ మేరకు ఖర్చులు కూడా కలిసొస్తాయి.

ఈ ప్లాంట్ ద్వారా సుమారు 400 మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవచ్చని అంచనా. దీనికి అనుబంధంగా రవాణా, గోనె సంచులు, యంత్ర పరికరాలు తయారీ, మరమత్తులు వగైరా రంగాలు అభివృద్ధి చెందుతాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా.

మరో విశేషమేమిటంటే, దీనిని గెయిల్‌కు చెందిన శ్రీకాకుళం-అంగుల్ సహజ వాయువు పైప్‌లైన్ సమీపంలోనే ఏర్పాటు చేయనున్నారు. యూరియా తయారీలో సహజ వాయువు ప్రధాన ముడిసరుకు కావడంతో సమీపంలో ఉన్న ఈ పైప్‌లైన్ ప్రాజెక్టుకు ఎంతో ఉపయోగపడుతుంది.

అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం మాత్రమే కుదిరింది. దీని ప్రకారం మూలపేటలో ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం సుమారు 600-700 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా ప్రభుత్వం భూసేకరణ చేపట్టాల్సి ఉంటుంది.

కనుక ఈ ప్లాంట్ నిర్మాణం, ఉత్పత్తి ప్రారంభం వంటి తదుపరి దశలు భూసేకరణ పూర్తయిన తర్వాతే మొదలవుతాయి. దీనికి కనీసం 6-7 నెలల సమయం పట్టవచ్చు. ఈ ప్రక్రియ అనుకున్న విధంగా సాగితే 2027 డిసెంబర్‌లోగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ministers Eye Exit: Trouble For Revanth Reddy?

The Telangana Congress is facing an interesting political situation even before completing three years in…

17 minutes ago

Anurudh’s Big Loss After Marriage: Real or Just Rumor?

Ever since the special glimpse of Simbu's Arasan, directed by Vetrimaaran was dropped, social media…

46 minutes ago