
బాలీవుడ్ వేడుకలను చూసి మన టాలీవుడ్ లో ఇలా ఎందుకు జరగట్లేదు అని మదనపడిన ప్రేక్షకులకు “ఐఫా” వంటి వేడుకలు కన్నుల విందు చేస్తున్నాయి. ఒక్క హీరోల సంస్కృతిలోనే కాదు, హీరోయిన్ల విషయంలోనూ టాలీవుడ్ ముద్దుగుమ్మలు బాలీవుడ్ ‘బోల్డ్ నెస్’ను అలవాటు చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో ఒక వేడుక జరిగింది అంటే… అది తారామణులకు అందాల ప్రదర్శనగా నిలుస్తుంది. ఒక్కోసారి ఆ సోయగాలను వీక్షిస్తూ ముక్కున వేలేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతలా బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ అందచందాలతో వీక్షకులను కట్టిపడేసేవారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో సందడి చేస్తోన్న హీరోయిన్లు కూడా అదే పోకడను అలవాటు చేసుకుంటున్నారు. తమ కాస్ట్యూమ్స్ విషయంలో లేటెస్ట్ ఫ్యాషన్ ను అనుసరిస్తూ వీక్షకులకు కన్నులవిందు చేస్తున్నారు. ఈ ఐఫా వేడుకల్లో సందడి చేసిన తారామణులలో ఎక్కువ శాతం మంది తమ సౌందర్యాలను కెమెరా కళ్ళకు చూపించిన వారే ఉండడం విశేషం. టాలీవుడ్ నాట ‘బాపు బొమ్మ’గా పిలుచుకునే ప్రణీత భారీ అందాల ప్రదర్శన నుండి బుల్లితెర హట్ యాంకర్ అనసూయ బ్యాక్ వొంపుసొంపుల వరకు అందరూ ‘గ్రీన్ కార్పెట్’పై కెమెరా కళ్ళకు షాక్ ఇచ్చేలా పోటీపడుతూ ఫోజులిచ్చారు.
ఈ ఐఫా వేడుకల్లో బాలీవుడ్ మాదిరే తెలుగు హీరోలు రానా, నానిలు యాంకర్లుగా వ్యవహరించి వేదికపై హంగామా సృష్టించారు. మున్ముందు ఇలాంటి అవార్డుల వేడుకల్లో తెలుగు సినీ ప్రేక్షకులు ఆశిస్తున్న వాతావరణం మన హీరోహీరోయిన్లు కూడా అనుసరించబోతున్నారని స్పష్టమవుతోంది. అయితే తెలుగునాట ఇలాంటి వేడుకలు సంవత్సరానికి ఒకటో, రెండో మాత్రమే జరుగుతుంటాయి. ఒకటి ఐఫా కాగా, మరొకటి ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం. ఈ రెండు వేడుకల్లో మాత్రమే హీరోహీరోయిన్లు ఇలా అలరిస్తుంటారు.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…