
2012, ఏప్రిల్ 24న జరిగిన ఈ హత్యోదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి మీడియా టైకూన్ పీటర్ ముఖర్జియాకూ పాత్ర ఉన్నట్లు కూడా కారు డ్రైవర్ శ్యామ్ వర్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఈ మేరకు శ్యామ్ వర్ ఇచ్చిన 12 పేజీల వాంగ్మూలాన్ని శుక్రవారం నాడు సీబీఐ కోర్టు నిందితులందరికీ అందజేసింది. అందులోని వివరాల ప్రకారం… వరుసకు సోదరుడైన పీటర్ కుమారుడు రాహుల్ తో ప్రేమలో పడిన కారణంగానే షీనాను ఆమె తల్లి ఇంద్రాణీ మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె రచించిన పథకానికి పీటర్ సహా శ్యామ్ వర్ రాయ్, ఇంద్రాణీ మాజీ భర్త సంజీవ్ ఖన్నాలు సహకరించారు.
కారులోనే జరిగిన షీనా హత్య ఉదంతం…. కారులో ఎక్కించుకున్న షీనాను డ్రైవర్ శ్యామ్ వర్, సంజీవ్ ఖన్నా, పీటర్ ముఖర్జియాలు కదలకుండా పట్టుకోగా, షీనాపై కూర్చున్న తల్లి ఇంద్రాణీ ఆమె గొంతు నులిమేసింది. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునేందుకు వారితో పెనుగులాడిన షీనా.., డ్రైవర్ శ్యామ్ వర్ చేతిని కొరికేసింది. దీంతో అతడి చేతికి గాయం కాగా, పెనుగులాడుతున్న కూతురును చూసి ఏ మాత్రం కనికరం లేకుండా ఇంద్రాణీ ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లుగా డ్రైవర్ సదరు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Akshay Kumar and Shraddha Kapoor were supposed to clash at the box office in December…
After the tragic stampede during the Pushpa 2 premiere at Sandhya Theatre in Hyderabad, Tollywood…