Telugu

జనసేనలోకి మోత్కుపల్లి నరసింహులు

చంద్రబాబుతో విభేదించి పార్టీ నుండి సస్పెండైన మోత్కుపల్లి నరసింహులు తెరాసలో చేరదామని అనుకున్నా అటువైపు నుండి ఎలాంటి స్పందన రాలేదు. అప్పట్లో వైకాపా నుండి విజయసాయి రెడ్డి వెళ్ళి ఆయనను కలిసినా రాజకీయంగా ఎటువంటి కదలికా రాలేదు, అయితే తాజాగా ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుంది.

ADVERTISEMENT

నేడో రేపో హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్టు సమాచారం. చంద్రబాబుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూవచ్చిన మోత్కుపల్లి… తాజాగా తిరుమల టూర్‌లోనూ ఏపీ సీఎంపై మాటల దాడి చేశారు. అయితే తన తిరుపతి టూరు నుండి జనసేనలోకి మోత్కుపల్లి టచ్‌లోకి వచ్చారని అంటున్నారు.

1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సమయంలో టీడీపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు… ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ, స్వతంత్ర, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారాయన. 1995లో టీడీపీ సంక్షోభ సమయంలో మోత్కుపల్లి ఎన్టీఆర్ వైపు నిలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన… 2001 తర్వాత కాంగ్రెస్ నుండి టీడీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన టీడీపీలోనే కొనసాగారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Niharika Konidela Announces New Film Pocket Rockets

Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…

15 minutes ago

Summer Holidays Trailer: A Family Story Set for Nov 6

After films like The Girlfriend, Chennai Love Story, and Couple Friendly, producer Dheeraj Mogilineni brings…

30 minutes ago