
తెలుగు చిత్ర సీమలో కొంతమంది యంగ్ స్టర్స్ మత్తులో తేలుతున్నట్లు తెలిసిందని, అలాంటి వారు 10 మందే కావచ్చు, కానీ వారి వలన మొత్తం ఇండస్ట్రీకే చెడ్డ పేరు వస్తోందని, అలాంటి వారు మత్తు వీడి బయటకు రావాలి, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అల్లు అరవింద్ హెచ్చరించారు. ముఖ్యంగా ముంబై రేవ్ పార్టీ సంస్కృతి ఇక్కడ బాగా పెరిగిందని, దీని వలన తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలుగా మారుతున్నారని, దయచేసి ఇలాంటి వారంతా చెడును వీడి మంచి మార్గంలోకి రావాలని కోరుకుంటున్నానని అల్లు అరవింద్ విజ్ఞప్తి చేసారు.
ఈ ప్రెస్ మీట్ లో మరో బిగ్ షాట్ దగ్గుపాటి సురేష్ బాబుతో పాటు ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరియు హీరో శ్రీకాంత్, నరేష్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 10 మందికి ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేయగా, అందులో ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, ఒక స్టంట్ మాస్టర్ ఉన్నారు. ఆరు రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన టాలీవుడ్ ప్రముఖులు బయటకు వచ్చారు.
తెలంగాణ అధికార పార్టీ లో కొండా సురేఖ వివాదం ఆరని చిచ్చు మాదిరి అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఇబ్బంది…
Fans finally have a major update on Dragon, the much-awaited collaboration between Jr. NTR and…