Telugu

ఆ రోడ్లకి వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలే సాక్షి

వైసీపీ ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌ కలిసి గురువారం కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు (నార్త్) గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిరువురూ కలిసి కనకదుర్గమ్మ కాలనీ, దళితవాడలలో పర్యటించారు. అక్కడ వారే స్వయంగా చెరువులుగా మారిన రోడ్ల పక్క నుంచి జాగ్రత్తగా నడుచుకొంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఆ ప్రాంతంలో ప్రజలను సంక్షేమ పధకాల గురించి అడుగుతుంటే వారు గుంతలు పడి చెరువులుగా మారిన రోడ్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.

ADVERTISEMENT

వారు చెపుతున్న సమస్యను ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ స్వయంగా కళ్ళారా చూశారు కనుక త్వరలోనే నాబార్డు నిధులతో రోడ్లు వేయిస్తామని ఎంపీ బాలశౌరి సర్ధి చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు.

అనంతరం ఎంపీ బాలశౌరి మీడియాతో మాట్లాడుతూ, “ప్రజలు సంక్షేమ పధకాల విషయంలో చాలా తృప్తిగానే ఉన్నారు. కానీ రోడ్లు, డ్రైనేజీలు, వంతెనల గురించే ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. త్వరలోనే నాబార్డు నిధులతో వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను,” అని చెప్పారు.

టిడిపి నేతలు ఈ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి “గుంతలు పడిన రోడ్లనే వేయించలేనివారు మూడు రాజధానులు నిర్మిస్తారట” అని ఎద్దేవా చేస్తున్నారు. నిజమే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwak’s #CULT Trailer: Thrills n Chills

Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…

9 minutes ago

Spirit Poster Trolls: Deepika Fans Target Vanga Again?

Sandeep Reddy Vanga has postponed Prabhas' Spirit once again, with the film now scheduled to…

56 minutes ago