
ఈ రోజు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా కాశీర్ లో జరిగిన ఉగ్రదాడి మారణకాండకు సంతాపం తెలియచేసి, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన సభ్యుడు మధుసూదన్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
దానికి తోడు వారి కుటుంబానికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందంటూ మధుసూదన్ కు నివాళ్లు అర్పించి, ఉగ్రదాడి పై తన స్పందన తెలియచేసారు. మతం అడిగి మరి 26 మందిని చంపడం దారుణమని, ఇటుమంటి మతోన్మాదాన్ని కూడా కొంతమంది సోడో సెక్యులరిజం పేరుతో వెనకేసుకురావడం దారుణమన్నారు.
అలాగే భారత్ లో ఉంటూ కొంతమంది కాంగ్రెస్ నాయకులు పాక్ పై ప్రేమ కురిపిస్తున్నారు, అటువంటి వారు భారత్ ను వీడి పాకిస్తాన్ వెళ్లిపోవచ్చు అంటూ కాంగ్రెస్ నేతల వైఖరి పై మండిపడ్డారు. జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాలలో ఉన్నప్పటికీ జాతీయవాదానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ నాయకురాలు మీద చేసిన వ్యాఖ్యలకు గాను పవన్ పై హాట్ కామెంట్స్ చేసారు భువనగిరి ఎంపీ చామల కిరణ్. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే వచ్చి చదివి వెళ్ళడానికి రాజకీయాలేమి సినిమాలు కాదు, ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి సున్నితమైన అంశాల మీద తన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలన్నారు.
అలాగే కాంగ్రెస్ ఒక సెక్యులర్ పార్టీ అని, నలుగురు ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి పర్యాటకులను కాల్చి చంపి వెళ్ళిపోతే వాళ్ళను పట్టుకోకుండా మోడీ ఇన్ని రోజులు ఎం చేస్తున్నారో చెప్పాలంటూ పవన్ పై విరుచుకుపడ్డారు.
అయితే ఈ ఉగ్రదాడి మీద పలువురు కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు, ప్రకటనల మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ అయ్యిందనే విషయం చామల కిరణ్ గమనించాల్సి ఉంటుంది.ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాక్ తో యుద్ధం చెయ్యవలసిన అవసరం భారత్ కు లేదని వ్యాఖ్యానించడం, అటుపిమ్మట నా మాటల ఆంతర్యం అదికాదు అంటూ కవర్ చెయ్యడం,
మరొక కాంగ్రెస్ సీఎం మాట్లాడుతూ ఆక్రమిత కాశ్మీర్ ను భారత్ లో కలిపేయాలంటూ మోడీకి విజ్ఞతపులు చేయడం..ఇలా ఒకే పార్టీ నుండి రెండు భిన్నమైన అభిప్రాయాలు బయటకు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం వారి నాయకులకు హెచ్చరికలు పంపాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పవన్ కొంతమంది కాంగ్రెస్ నేతల ద్వంద వైఖరి పై విమర్శలు చెయ్యాల్సి వచ్చింది.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…