
దీంతో టీమిండియా పగ్గాలు కోహ్లీకి వశమయ్యాయి. కోహ్లీ టెస్ట్ కెప్టెన్ గా నియామకం కావడం అనివార్యం కావడంతో, కోహ్లి కెప్టెన్సీలో ఆటగాడిగా ఆడాల్సి రావడం ధోనీని ఇబ్బంది పెట్టే అంశమని, అందుకే టెస్టుల నుంచి తప్పుకున్నాడని క్రీడా విశ్లేషకులు పేర్కొంటుంటారు. దీనిని అవకాశంగా మలచుకున్న కోహ్లీ కెప్టెన్ అయిన తరువాత విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వరుస సెంచరీలతో పాటు 50 సగటుతో పరుగులు చేస్తూ అనితర సాధ్యమైన ఫిట్ నెస్ తో పాటు ఫాంతో సమకాలీనులకు సవాల్ విసురుతున్నాడు.
దీంతో కోహ్లీని వన్డే, టీ20లకు కూడా కెప్టెన్ గా నియమించాలంటూ డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టులు విరివిగా జరుగుతున్న నేపథ్యంలో ప్రాక్టీస్ లేని ధోనీ, వన్డే, టీ20ల్లో రాణించే అవకాశాలు అంతంత మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీపై విమర్శలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కోహ్లీని వన్డే, టీ20 కెప్టెన్ గా నియమించేందుకు ఎంతో కాలం పట్టేలా కనిపించడం లేదు. దీంతో ధోనీ శకం ముగిసే సమయం దగ్గర పడిందన్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయి.
One of the crucial failures of the TDP+ government before the 2019 Andhra Pradesh election…
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…