Telugu

రాజకీయ బంధాలు….రక్త సంబంధాలను పాడేకేస్తున్నాయా.?

రాజకీయం అంటేనే రాజీలేని పోరాటం, అయితే ఆ పోరాటంలో ఎదగడానికి, ప్రత్యర్థిని అణచడానికి ఒక్కోసారి రక్త సంబంధాలను కూడా బలిపీఠం ఎక్కించాల్సి ఉంటుంది. సమకాలీన రాజకీయంలో అటువంటి ఘటనలు కోకోల్లలుగా సాక్ష్యాత్కారం అవుతూనే ఉంటున్నాయి.

మొన్న వైఎస్ కుటుంబంలో అన్న జగన్ – చెల్లి షర్మిల మధ్య రాజకీయ చిచ్చు రాజేసింది, నిన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబంలో ఏకంగా తండ్రి – కూతురు మధ్య విభేదాల వారధి కట్టింది, కేటీఆర్ – కవిత మధ్య రాజకీయ ఆధిపత్యానికి బాటలు వేసింది కూడా ఈ రాజకీయమే.

ADVERTISEMENT

ఇక నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుల నాయకుడిగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభం మృతి కూడా రాజకీయ బంధాల యొక్క మరో వికృత రూపాన్ని చూపించింది. ముద్రగడ మరణ వార్త తో ఇటు ఏపీ అటు తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నేతలు ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. అలాగే ఆయనకు శ్రద్ధాంజలి ఘంటించారు.

అయితే తండ్రి కడసారి చూపు కోసం ముద్రగడ నివాసానికి వెళ్లిన ఆమె కుమార్తె క్రాంతికి అక్కడ చేదు అనుభవం ఎదురయ్యింది. క్రాంతి గో బ్యాక్ అంటూ ముద్రగడ అనుచరులు నినాదాలు చేయడం, తండ్రి మానసిక క్షోభకు కారణం కుమార్తె క్రాంతి నే అంటూ వైసీపీ శ్రేణులు నినదించడంతో ఆ విషాద వాతావరణం కాస్త ఉద్రిక్త వాతావరణంగా మారిపోయింది.

తన తండ్రిని చివరి చూపు చూసేందుకు అడ్డుకుంటున్న వారి పై క్రాంతి మండిపడుతున్న వీడియోలు, ఆ సమయంలో ఆమె పడుతున్న ఆవేదన, బాధ చూస్తుంటే రాజకీయాలు ఎంత బలమైన రక్త సంబంధాలను కూడా పాడెక్కించగలవు అనేది తేలిపోయింది.

ముద్రగడ వైసీపీ కి మద్దతుగా జగన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కాపు నుంచి రెడ్డి గా మారేందుకు సైతం సిద్దపడ్డారు. ఇక ముద్రగడ తనయుడు గిరి కూడా తండ్రి బాటలోనే వైసీపీ జెండా మోశారు. ఇక ఆయన కుమార్తె క్రాంతి తండ్రి ఆలోచనలకు విరుద్ధంగా ఆయన రాజకీయ సిద్ధాంతాలతో విభేదించి జనసేన కు జై కొట్టింది, పవన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్దపడింది.

ఇలా ముద్రగడ కుటుంబంలో వైసీపీ – జనసేన అంటూ వేరుపడిన రాజకీయ దారులు చివరికి తండ్రి – కూతురు, అన్న – చెల్లి మధ్య ఉంటే రక్త బంధాలకు కూడా నీళ్లొదులుకునే పరిస్థితికి తెచ్చాయి. ఒక తండ్రని చివరి చూపు చూసుకోవడం కోసం కుమార్తె తన సొంత వారితోనే పోరాటం చేసే స్థాయికి వెళ్లిందంటే అది రాజకీయాలకున్న బలమనుకోవాలా.? లేదా రక్త బంధాలు రాజకీయ బంధాల కంటే బలహీనమని భావించాలా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

India Won Series: Kerala Star Shuts Down Haters

India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…

5 hours ago

BB Telugu: Eliminated In Week 1 & Re-Entry In Week 2

With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…

6 hours ago