
ఇప్పటికే వైసీపి విపరీత రాజకీయ పోకడలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కంపుకొడుతున్నాయి. మార్పులు చేర్పులతో వైసీపి కూడా కంపుకొడుతోంది. ఇప్పుడు పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా రోడ్ల పక్కన చెత్తపేరుకుపోయి కంపుకొడుతోంది.
పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నందున చెత్తని తీసుకువెళ్ళే వాహనాలు రావడం లేదు. మురుగు కాలువలు శుభ్రం చేసేవారు కూడా లేకపోవడంతో అవి పేరుకుపోతున్నాయి. దాంతో పగలూ రాత్రి తేడా లేకుండా ఒకటే దోమలు. వాటిలో డెంగూ, మలేరియా దోమలు కూడా ఉంటాయని వేరే చెప్పక్కరలేదు.
పారిశుధ్య కార్మికులు ఒక్కరోజు శుభ్రం చేయకపోతే రాష్ట్రం ఎంత అధ్వానంగా మారిపోతుందో ఇప్పుడు అందరూ కళ్ళారా చూస్తున్నారు. అయినప్పటికీ వైసీపి ప్రభుత్వం వారి ప్రాధాన్యతని గుర్తించడం లేదు. “బేషరతుగా సమ్మె మానేసి విధులలో చేరితేనే ఏవైనా మాటలు…” అని మంత్రి బొత్స సత్యనారాయణ నిష్కర్షకగా చెప్పేసారు.
నిన్న అంగన్వాడీ కార్యకర్తల మీద ఎస్మా ప్రయోగించిన వైసీపి ప్రభుత్వం రేపు పారిశుధ్య కార్మికుల మీద ప్రయోగించదని అనుకోలేము. నేడో రేపో ఆ ముచ్చటా చూడవచ్చు. అయితే ఎస్మాని చూసి అంగన్వాడీ కార్యకర్తలు ఎవరూ బెదిరిపోలేదు. ఇంకా తమ పోరాటాన్ని ఉదృతం చేశారు. కనుక పారిశుధ్య కార్మికులు కూడా అదే చేయవచ్చు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద పారిశుధ్య కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే వారి పట్ల ప్రభుత్వ వైఖరి భిన్నంగా ఉన్నందున, ఎక్కడికక్కడ పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే పారిశుధ్య కార్మికుల సమ్మెకు ఇది పరిష్కారం కాదని ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే ప్రస్తుతం జగన్ సొంత ఇంటిని అంటే వైసీపిని సర్దుకునే పనిలో బిజీగా ఉన్నారు కనుక వారి గోడు వినే నాధుడే లేడు.
ప్రభుత్వోద్యోగులతో, ఉపాధ్యాయులతో జగన్ ప్రభుత్వానికి పేచీ.. అంగన్వాడీ కార్యకర్తలతో పేచీ… చివరికి పారిశుధ్య కార్మికులతో కూడా పేచీయేనా? సలహాదారులకు, వాలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి ఇస్తున్న జీతభత్యాలు, చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలపై కేసుల కోసం లాయర్ల కోసం చేస్తున్న ఖర్చులు, రాజధాని కేసు కోసం చేస్తున్న ఖర్చులు, సంక్షేమ పధకాల ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చులతో పోలిస్తే పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నది ఏపాటి?
Payal Radhakrishna makes a black dress feel anything but predictable in this striking fashion shoot.…
Drishyam 3 actress Shriya Saran has opened up about being a victim of AI-morphed photos.…