Telugu

వయసు 62 ఉత్సాహం 22

కొందరు యువకులు పుట్టుకతో వృద్ధులని శ్రీశ్రీ గారు ఊరికే రాయలేదు. వయసు నలభై యాభై దాటగానే ఏదో వృద్ధాప్యం వచ్చేసింది ఇంకేమీ సాధించలేమనే నిర్లిప్తతతో గడిపే సగటు జనాలు మన దేశంలోనే కోట్లలో ఉన్నారు. రిటైర్మెంట్ వయసు రాగానే పార్కులో ఉదయం జాగింగ్ చేయడమే గొప్ప పనిగా భావించే వాళ్లకు కొదవే లేదు. రియల్ లైఫ్ బిగిన్స్ ఆఫ్టర్ ఫార్టీ అని ఒక ఇంగ్లీష్ నానుడి ఉంది. అంటే నాలుగు పదుల జీవితం గడిపాకే మనలో అసలైన మనిషి బయటికి వస్తాడనేది దానర్థం. ఇప్పుడు దీని గురించి ఎందుకంటే కీరవాణి ఆస్కార్ అందుకునే నాటికి ఆయన ఏజ్ అక్షరాలా 62. అంటే సగటు గవర్నమెంట్ పదవి విరమణ వయసు అయిపోయింది.

సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప దర్శకులైనా మ్యూజిక్ డైరెక్టర్లైనా కెరీర్ లో పీక్స్ చూశాక పది పదిహేనేళ్ల తర్వాత బాగా నెమ్మదించి మునుపటి మేజిక్ చేయలేకపోతారు. ఒకప్పుడు అభినందన, గీతాంజలి లాంటి ఆల్బమ్స్ ఇచ్చిన ఇళయరాజా గారు ప్రస్తుతం రంగమార్తాండకు పాటలిచ్చారు. దాన్ని ఆడియన్స్ నెత్తినబెట్టుకున్న దాఖలాలు లేవు. ప్రేమదేశం, రోజా నాటి ఏఆర్ రెహమాన్ ని చూపించమంటే సమాధానం కష్టం. పోటీని తట్టుకోలేక 90 టైంలో కీరవాణితో తీవ్రంగా పోటీ పడ్డ కోటి ఎప్పుడో సైడ్ అయ్యారు. ఆయన ఫ్రెండ్ రాజ్ గురించి చెప్పనక్కర్లేదు. అంతెందుకు దేవిశ్రీ ప్రసాద్ లాంటి యువకుడే తన స్టామినా తగ్గట్టు ఇవ్వడం లేదు.

ADVERTISEMENT

ఇది గత చరిత్రలో ఎందరికో వర్తిస్తుంది. కెవి మహదేవన్, సత్యం, మాధవపెద్ది సురేష్, శ్రీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది. కీరవాణి ఇక్కడే తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటతో తాను మనల్నే కాదు గ్లోబల్ ఆడియన్స్ ని సైతం మైమరపింపజేయగలనని ఋజువు చేశారు. ఎప్పుడో 1990లో ఉషాకిరణ్ మూవీస్ మనసు మమతతో ఎంట్రీ ఇచ్చిన కీరవాణికి ఆ సమయంలో ఉన్న పోటీ విపరీతమైన సవాళ్ళను ఒత్తిడిని తీసుకొచ్చింది. రామ్ గోపాల్ వర్మ, రాఘవేంద్రరావు లాంటి వాళ్ళతో జట్టు కట్టాక అసలు సత్తా బయటికి వచ్చింది. ఇప్పటికీ టాలీవుడ్ బెస్ట్ ఆడియో క్యాసెట్స్ సేల్స్ లో పెళ్లిసందడి, అన్నమయ్యలున్నాయి

మేజర్ చంద్రకాంత్ లో స్వర్గీయ ఎన్టీఆర్ కు కంపోజ్ చేసినా, సీతారామయ్య గారి మనవరాలులో అక్కినేనికి బాణీలు సమకూర్చినా సూపర్ హిట్ పాటలు కొట్టడం ఆయన శైలి. చిరంజీవికి ఘరానా మొగుడు, బాలయ్యకు బొబ్బిలిసింహం, వెంకటేష్ కి అబ్బాయిగారు, నాగార్జునకు అల్లరి అల్లుడు ఇలా నిన్నటి తరం నుంచి ఇప్పటి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల హయాం దాకా మరపురాని పాటలను అలుపు లేకుండా అందివ్వడం ఒక్క కీరవాణికే సాధ్యమయ్యింది. రాజమౌళి మహేష్ బాబుల సినిమాకూ ఆయన ఇంతే ఉత్సాహం చూపిస్తారు. ఇదేదో ఆయన్ను పొగడడానికి కాదు. ఎనర్జీకి వయసుకి సంబంధం లేదని చెప్పేందుకు ఒక ఉదాహరణ వివరించడం మాత్రమే

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

IShowSpeed For Spirit? Prabhas Film Gets A Crazy Buzz

Prabhas and Sandeep Reddy Vanga’s Spirit has been grabbing attention with its casting updates and…

33 minutes ago

Jogi’s DIL Reaches Governor: Threat To Her Life?

The highly controversial case pertaining to Jogi Rajeev, the son of former cabinet minister Jogi…

1 hour ago